ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల..
ABN , Publish Date - Jul 04 , 2026 | 03:17 PM
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.78 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అర్హులైన ప్రతి రైతుకు దశలవారీగా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రైతులకు సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. మిగిలిన అర్హులైన రైతులకు కూడా త్వరలోనే తదుపరి విడత నిధులను విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read:
కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
మమతాకు మరో షాక్.. రాజీనామా చేసిన పార్టీ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య