Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 03 , 2026 | 06:59 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 03, 2026 20:47 IST

    ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో చోరీ కేసు ఛేదింపు

    • చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

    • బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరి అరెస్ట్

    • రూ.8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం స్వాధీనం

    • 151.30 గ్రాముల వెండి, నగదు, ఐఫోన్లు, ఐప్యాడ్‌, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం

    • కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముఠా

  • Aug 03, 2026 20:44 IST

    కడప: గోపవరం మండలం రామిరెడ్డి పాలెం ప్రాథమిక పాఠశాలలో విషాదం

    • పెట్రోల్ పోసుకుని స్కూల్ ఆవరణంలోనే ఆత్మహత్య చేసుకున్న స్కూల్ టీచర్ మల్లెం కొండయ్య

    • టీచర్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని చర్చించుకుంటున్న స్థానికులు

    • కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు

  • Aug 03, 2026 20:35 IST

    కడప: గోపవరం మండలం రామిరెడ్డి పాలెం ప్రాథమిక పాఠశాలలో విషాదం

    • ఆ స్కూల్ టీచర్ మల్లెం కొండయ్య పెట్రోల్ పోసుకుని స్కూల్ ఆవరణంలోనే ఆత్మహత్య

    • టీచర్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని చర్చించుకుంటున్న స్థానికులు

    • కేసు నమోదుచేసి విచారిస్తున్న పోలీసులు

  • Aug 03, 2026 19:41 IST

    హైదరాబాద్: పాతబస్తీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

    • ఐఎస్ సదన్ చౌరస్తా-సైదాబాద్ ప్రధాన రహదారిపై మృతదేహం లభ్యం

    • బ్రిడ్జి నిర్మాణ సామగ్రి సమీపంలో గుర్తించిన స్థానికులు

    • వెంటనే ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం

    • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీంతో ఆధారాల సేకరణ

    • మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలింపు

    • మృతుడు యాచకుడై ఉండొచ్చని ప్రాథమిక అనుమానం

    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 03, 2026 19:36 IST

    సూర్యాపేట: కోదాడలో 6 కేజీల గంజాయి స్వాధీనం

    • నలుగురి అరెస్టు

  • Aug 03, 2026 18:27 IST

    శ్రీకాకుళం: జిల్లా కోర్టులో లొంగిపోయిన తమ్మినేని సీతారాం కొడుకు

    • సంతకాల ఫోర్జరీ, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో లొంగిపోయిన చిరంజీవి నాగ్

    • బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

    • ఈనెల 10న మళ్లీ హాజరుకావాలని ఆదేశం

    Thammineni-Nag.jpg

  • Aug 03, 2026 18:23 IST

    బెంగళూరు: మంత్రి పదవుల ఆశావహులు ఓర్పుతో ఉండాలి: డీకే

    • అందరికీ ఏదో ఒక అవకాశం ఇస్తాం: డీకే శివకుమార్

    • ఓర్పు వల్లే ఈ స్థాయికి వచ్చాను: సీఎం డీకే శివకుమార్

    • పార్టీయే తుదినిర్ణయం తీసుకుంది: డీకే శివకుమార్

    • పార్టీలో అర్హులైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు: డీకే

    • 2004లో నన్ను కూడా కేబినెట్‌లోకి తీసుకోలేదు: డీకే

  • Aug 03, 2026 18:06 IST

    మధ్యప్రదేశ్: దతియా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

    • 6,016 ఓట్ల ఆధిక్యంతో ఘన్‌శ్యామ్ సింగ్ విజయం

    • బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందిన ఘన్‌శ్యామ్ సింగ్

    • కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్‌కు 66,757 ఓట్లు పోలయ్యాయి

    • బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీకి 60,741 ఓట్లు పోలయ్యాయి

  • Aug 03, 2026 18:00 IST

    అమరావతి: ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఏపీ గ్రామీణ బ్యాంక్ గుడ్‌న్యూస్

    • ఎస్‌హెచ్‌జీ రుణాలపై అన్ని సేవా ఛార్జీలకు ఏపీజీబీ స్వస్తి

    • రూ.5 లక్షలపైన రుణాలపై వడ్డీ 13% నుంచి 12%కి తగ్గింపు

    • ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తి మాఫీ

    • ఇన్‌స్పెక్షన్, పాస్‌బుక్ ప్రింటింగ్ ఛార్జీలు కూడా రద్దు

    • జులై 1 నుంచే ఛార్జీలు వసూలుచేయొద్దని ఏపీజీబీ ఆదేశాలు

    • ఎస్‌హెచ్‌జీ మహిళలపై ఆర్థిక భారం తగ్గించేలా కీలక నిర్ణయం

  • Aug 03, 2026 17:40 IST

    articleText

  • Aug 03, 2026 17:35 IST

    బిహార్: ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం

    • బంకీపూర్ ఉప ఎన్నికలో పీకే ఘన విజయం

    • 18,953 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించిన పీకే

    • మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి

    • నా గెలుపు బీజేపీ హైకమాండ్‌కు ఓ సందేశం: పీకే

    • నేర చరిత్ర ఉన్న వ్యక్తిని బిహార్ సీఎంగా చేశారు: పీకే

  • Aug 03, 2026 17:11 IST

    విశాఖ: రైల్వే స్టేడియంలో తప్పిన ప్రమాదం

    • భారీ గాలులకు కుప్పకూలిన ఫ్లడ్ లైట్

    • వాకర్స్ ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

    • ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు

  • Aug 03, 2026 16:45 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముందంజ

    • 28వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 19,419 ఓట్ల ఆధిక్యం

    • ప్రశాంత్ కిషోర్‌ (జేఎస్‌పీ) - 59213

    • నీరజ్ కుమార్(బీజేపీ) - 39794

    Gujarat-Elections.jpg

  • Aug 03, 2026 16:43 IST

    కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో సింగరేణికి మరో కోల్‌ బ్లాక్‌

    • PKOC-2 కోల్ బ్లాక్‌ సింగరేణికి కేటాయింపు

    • అందుబాటులోకి అదనపు బొగ్గు నిల్వలు

    • 3 కోల్ బ్లాక్‌లతో భారీగా సమకూరనున్న ఆదాయం

  • Aug 03, 2026 16:41 IST

    కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్త జ్వాలలు

    • మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ రాజీనామా

    • యశ్వంతరాయ బాటలోనే మరో ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ

    • రేపు ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ రాజీనామా చేస్తారని సమాచారం

    • మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటున్న గోపాలకృష్ణ

    • కుట్రతోనే తనను మంత్రి పదవి నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆరోపణ

  • Aug 03, 2026 16:40 IST

    కర్ణాటక కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ

    • కేబినెట్‌లో 20 మందికి చోటు కల్పించిన సీఎం డీకే శివకుమార్‌

    • 12 మంది కొత్తవారు సహా 8 మంది పాత మంత్రులు కొనసాగింపు

  • Aug 03, 2026 16:40 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో సిట్‌ మరో కస్టడీ పిటిషన్‌

    • A5 బాబూరావు, A6 సాంబయ్యను 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌

  • Aug 03, 2026 16:34 IST

    ఢిల్లీ: కాంగ్రెస్‌ తీరుపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అసంతృప్తి

    • బిల్లులపై చర్చ జరగాలని స్పష్టం చేసిన రిజిజు

    • చర్చ లేకుండానే కీలక బిల్లులు ఆమోదం పొందడం బాధాకరమన్న రిజిజు

    • రెండు బిల్లులు ఆమోదమైనా విపక్షం ఆందోళనలకే పరిమితమైంది: రిజిజు

    • కాంగ్రెస్‌ ఎంపీలు తమ వైఖరిని మార్చుకుని చర్చల్లో పాల్గొనాలి: రిజిజు

    • విపక్ష డిమాండ్లు వేరే అంశమని.. బిల్లులపై చర్చ మాత్రం జరగాల్సిందేనన్న రిజిజు

  • Aug 03, 2026 16:30 IST

    బిహార్: బంకీపూర్‌ ఉప ఎన్నికలో ఆధిక్యంపై ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

    • ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తొలి ప్రాధాన్యమన్న కిశోర్‌

    • 2-3 నెలల్లో బంకీపూర్‌లో మార్పులు కనిపిస్తాయన్న కిశోర్

    • భారీ హామీలు ఇవ్వడం తనకు ఇష్టం లేదన్న జన సురాజ్‌ అధినేత

    • ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన బంకీపూర్‌ రాత్రికి రాత్రే బెంగళూరుగా మారదన్న కిశోర్

    • బీజేపీ నాయకత్వానికి బంకీపూర్‌ ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారన్న కిశోర్‌

  • Aug 03, 2026 16:13 IST

    గుజరాత్: మంజాల్ పూర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం

    • 30,630 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై సతేంద్ర భాయ్ పటేల్ ఘన విజయం

    Gujarat-Elections.jpg

  • Aug 03, 2026 16:11 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముందంజ

    • 25వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 14,953 ఓట్ల ఆధిక్యం

    • ప్రశాంత్ కిషోర్‌ (జేఎస్‌పీ) - 50976

    • నీరజ్ కుమార్(బీజేపీ) - 36023

  • Aug 03, 2026 16:09 IST

    అమరావతి: ఫ్యాన్‌కోనీ అనీమియా బాధిత బాలుడికి అండగా మంత్రి సుభాష్

    • దాతలు, సేవా సంస్థల సహకారంతో చికిత్సకు నిధుల సమీకరణ

    • రూ.20 లక్షల బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

    • బోన్ మ్యారో దాత నుంచి సేకరణ ప్రక్రియ విజయవంతం

    • హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో చరణ్ తేజ పవన్‌కు చికిత్స

  • Aug 03, 2026 15:59 IST

    హైదరాబాద్ వాసులకు అలర్ట్..

    • ఇవాళ రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచన

  • Aug 03, 2026 15:59 IST

    కృష్ణా: జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ 6కి వాయిదా

    • ఈనెల 6లోపు కౌంటర్ దాఖలు చేయాలని ADJ కోర్టు ఆదేశం

  • Aug 03, 2026 15:58 IST

    ఏపీ లిక్కర్‌ స్కాం కేసు నిందితుల రిమాండ్‌ పొడిగింపు

    • వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్ కుమార్ రిమాండ్‌ను ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు

  • Aug 03, 2026 15:47 IST

    బిహార్‌: బంకీపూర్‌ ఉప ఎన్నిక.. ప్రశాంత్‌ కిశోర్‌ భారీ ఆధిక్యం

    • జన సురాజ్‌ పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభం

    • ఫలితాలపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

    Jan-Suraj-Party-Leaders.jpg

  • Aug 03, 2026 15:42 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముందంజ

    • 23వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 13,269 ఓట్ల ఆధిక్యం

    • ప్రశాంత్ కిషోర్‌ (జేఎస్‌పీ) - 46,377

    • నీరజ్ కుమార్(బీజేపీ) - 33,108

  • Aug 03, 2026 15:39 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 544 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 391 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Aug 03, 2026 15:39 IST

    ఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం

    • ఒక వాహనం నుంచి మరో వాహనానికి (V2V) సమాచార మార్పిడి సాంకేతికతపై ముసాయిదా విడుదల

    • వాహనం-వాహనంతో మాట్లాడే 'V2V' సాంకేతికతకు శ్రీకారం చుట్టిన కేంద్ర రహదారి, రవాణా శాఖ

    • అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, ముందస్తు ప్రమాదాలు ఉన్నా హెచ్చరించే సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం

    • 5.875 GHz నుండి 5.925 GHz లైసెన్స్ రహిత ఫ్రీక్వెన్సీ కేటాయింపు

    • 2027 అక్టోబర్ నుంచి విడతల వారీగా అమలులోకి తీసుకురానున్న కేంద్రం

    • అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) పరిధి దాటి పనిచేయనున్న సరికొత్త సి-వి2ఎక్స్ (C-V2X) సాంకేతికత

  • Aug 03, 2026 15:36 IST

    ఢిల్లీ: లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) నిర్ణయాలు

    • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ బిల్లుపై చర్చకు 3 గంటల సమయం కేటాయింపు

    • బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లుపై చర్చకు 3 గంటల కేటాయింపు

    • టాక్సేషన్ & ఇతర చట్టాల (సవరణ) బిల్లుపై చర్చకు 5 గంటల కేటాయింపు

    • రామ మందిరం విరాళాల అంశంపై చర్చ జరపాలని BAC సమావేశంలో సమాజ్ వాదీ పార్టీ డిమాండ్

  • Aug 03, 2026 15:32 IST

    హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ కీలక ప్రకటన

    • ఒమన్‌తో తాత్కాలిక సురక్షిత షిప్పింగ్‌ మార్గంపై చర్చల్లో పురోగతి: ఇరాన్

    • అమెరికా, ఇజ్రాయెల్‌ సైనిక దాడులు ఆగితేనే హోర్ముజ్‌ పూర్తిగా తెరుచుకుంటుందన్న ఇరాన్

  • Aug 03, 2026 15:29 IST

    హైదరాబాద్: సచివాలయంలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

    • పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతారామ ప్రాజెక్టులపై చర్చ

    • ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష

  • Aug 03, 2026 15:28 IST

    ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా

    • విపక్షాల ఆందోళన నడమ సభ రేపటికి వాయిదా

  • Aug 03, 2026 15:25 IST

    రికార్డు దిశగా ‘ది ఒడిస్సీ’ సినిమా

    • మూడు వారాంతాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 911 మిలియన్ డాలర్ల వసూళ్లు

    • త్వరలోనే 1 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరే అవకాశం

    • ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ‘ది ఒడిస్సీ’ జోరు

  • Aug 03, 2026 15:24 IST

    ఢిల్లీ: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ

    • కర్ణాటక నీరు విడుదల చేయలేదంటూ సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్‌

    • CWMA ఆదేశాలు అమలు చేయడం లేదని ఆరోపణ

    • వెంటనే కావేరీ జలాలు విడుదల చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి

  • Aug 03, 2026 15:21 IST

    లఖ్‌నవూ: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

    • రామమందిర్‌ ట్రస్టు విధుల నుంచి ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషి తొలగింపు

  • Aug 03, 2026 15:20 IST

    ఢిల్లీ: సహజీవనంలో ఉన్న మహిళల రక్షణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • సహజీవనంలోనూ వర్తించనున్న IPC సెక్షన్ 498A

    • పెళ్లి కాలేదనే నెపంతో వేధింపుల నుంచి తప్పించుకోలేరు: జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం

    • సహజీవనంలో భాగస్వామి వేధింపులకు గురిచేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు: సుప్రీంకోర్టు

    • పెళ్లి కాలేదనే నెపంతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరు: సుప్రీంకోర్టు

    • భాగస్వామిని 'భర్త'తో సమానంగా పరిగణించవచ్చన్న సుప్రీంకోర్టు

  • Aug 03, 2026 15:13 IST

    ఢిల్లీ: మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లోని కొనసాగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

    • బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాల్లో ముందజాలో ఉన్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్

    • 20 రౌండ్ పూర్తయ్యే సరికి 11,621 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్న ప్రశాంత్ కిషోర్

    • మధ్యప్రదేశ్ దతియా ఉప ఎన్నికల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, 9,519 ఓట్ల ఆధిక్యంలో ఘనశ్యామ్ సింగ్

    • గుజరాత్ మంజాల్ పూర్ బీజేపీ అభ్యర్థి ముందంజ, 30,567 ఓట్ల ముందంజలో సతేంద్ర భాయ్ పటేల్

  • Aug 03, 2026 15:00 IST

    శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం

    • గాయం కారణంగా దూరమైన బుమ్రా స్థానంలో జమ్మూకశ్మీర్‌ బౌలర్‌ అకిబ్‌ నబీకి అవకాశం

    • ఈనెల 15 నుంచి శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్‌

  • Aug 03, 2026 14:38 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముందంజ

    • 18వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 10,436 ఓట్ల ఆధిక్యం

    • ప్రశాంత్ కిషోర్‌ (జేఎస్‌పీ) - 35,713

    • నీరజ్ కుమార్(బీజేపీ) - 25,277

  • Aug 03, 2026 14:25 IST

    హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

    • సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్ని, బోయిన్‌పల్లి, రసూల్ పురలో భారీ వర్షం

    • తార్నాక, హబ్సిగూడ, హిమాయత్ నగర్, నారాయణగూడలో వర్షం

  • Aug 03, 2026 14:22 IST

    ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా

    • విపక్షాల ఆందోళన నడుమ సభ రేపటికి వాయిదా

    • సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • Aug 03, 2026 13:43 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముందంజ

    • 16వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 14వేల ఓట్ల ఆధిక్యం

    • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఉపఎన్నిక

  • Aug 03, 2026 13:33 IST

    మరో పేపర్ లీక్.. మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ

    • జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకల ఆరోపణలు

    • రాజధాని రాంచీలో కొనసాగుతున్న ఆందోళనలు

    • నియామక పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థుల డిమాండ్

    • విద్యార్థులకు సీజేపీ మద్దతు

  • Aug 03, 2026 13:25 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ ముందంజ

    • 11వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిపై 6,400 ఓట్ల ఆధిక్యం

    • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఉపఎన్నిక

  • Aug 03, 2026 13:25 IST

    బ్రిజ్భూషణ్‌పై రెజ్లర్ వినేష్ ఫొగాట్ విమర్శలు

    • బ్రిజ్‌భూషణ్‌ను ప్రభుత్వం కాపాడుతోంది: వినేష్

    • ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాం: వినేష్

  • Aug 03, 2026 13:23 IST

    ఢిల్లీ: ప్రజల్లో జగన్‌పై చర్చ జరుగుతోంది: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

    • ఉత్తరాంధ్ర పర్యటనతో జగన్ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు: ఎంపీ కలిశెట్టి

    • జగన్ ఉత్తరాంధ్ర పర్యటన చేసి సాధించేందేంటి?: ఎంపీ కలిశెట్టి

    • ప్రధాని పర్యటనకు కూడా జగన్ ఆటకం కలిగించారు: ఎంపీ కలిశెట్టి

    • అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి

  • Aug 03, 2026 13:13 IST

    ఢిల్లీ: ఇక జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు, నిరసనలు బంద్?

    • జంతర్ మంతర్ దగ్గర నిరసనలపై సుప్రీంకోర్టులో విచారణ

    • నిరసనలకు ప్రత్యామ్నాయ వేదిక కేటాయింపుపై కేంద్రాన్ని సంప్రదించాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీం సూచన

    • నిరసనల నిర్వహణకు జంతర్ మంతర్ సరైన ప్రదేశం కాదన్న వాదనను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం

  • Aug 03, 2026 13:11 IST

    కేజ్రీవాల్‌ నేతృత్వంలో రేపు ప్రధాని నివాసం వరకు పాదయాత్ర

    • E20 పెట్రోల్‌పై వినతిపత్రం సమర్పించనున్న ఆప్‌ నేతలు

    • E20 పెట్రోల్‌ వల్ల వాహనాలు పాడవుతున్నాయని ఆప్‌ అభ్యంతరం

  • Aug 03, 2026 13:01 IST

    బిహార్‌లోని బంకీపూర్ ఉపఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రశాంత్ కిశోర్

    • 9వ రౌండ్ ముగిసే సమయానికి 17,856 ఓట్ల ఆధిక్యంలో జనసురాజ్ అధినేత

    • బంకీపూర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్పూర్ కొనసాగుతున్న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

  • Aug 03, 2026 12:42 IST

    ఏపీ రైతులకు శుభవార్త

    • ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు పొడిగింపు

    • ఈనెల 15 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం

  • Aug 03, 2026 12:28 IST

    తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    • మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

    • తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై వివాదం

    • మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తమిళనాడు ప్రభుత్వం

  • Aug 03, 2026 12:28 IST

    నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

    • డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు బిల్డప్ ఇచ్చారు: కేటీఆర్

    • కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది?: కేటీఆర్

    • జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండేళ్లయినా ఉద్యోగాలు భర్తీ చేయలేదు: కేటీఆర్

  • Aug 03, 2026 12:27 IST

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ

    • కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో సుప్రీంకోర్టుకు అభిషేక్

    • వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్

    • వారంలో విచారించి తీర్పు ఇవ్వాలని కోల్‌కతా హైకోర్టుకు సుప్రీం సూచన

  • Aug 03, 2026 12:26 IST

    ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌

    • వారం రోజుల కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్‌

  • Aug 03, 2026 12:25 IST

    పార్లమెంట్‌ ఉభయసభలు మ.2 గంటలకు వాయిదా

    • ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై సమాధానం చెప్పాలని విపక్షాల డిమాండ్‌

    • అయోధ్య రామాలయ విరాళాలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

    • విపక్షాల నినాదాల మధ్య ఉభయసభల వాయిదా

  • Aug 03, 2026 12:11 IST

    కర్ణాటక కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ

    • కేబినెట్‌లో 12 మంది కొత్త మంత్రులు

    • 8 మంది మంత్రుల కొనసాగింపు

  • Aug 03, 2026 11:59 IST

    అమరావతి: వైసీపీ MLA విరూపాక్షి దాడి కేసు

    • విరూపాక్షి దాడిలో గాయపడిన శేఖర్ యాదవ్ పరిస్థితి విషమం

    • మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలింపు

    • టీడీపీ నేత శేఖర్ యాదవ్ స్వస్థలం చిప్పగిరి మం. సంగాల

  • Aug 03, 2026 11:57 IST

    సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ప్రాంగణంలో అంబారి ఊరేగింపు

    • పురవీధుల్లో అంబారీపై ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు

  • Aug 03, 2026 11:54 IST

    లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

    • 650 పాయింట్లకుపైగా లాభంలో సెన్సెక్స్

    • 200 పాయింట్లకుపైగా లాభంలో నిఫ్టీ

  • Aug 03, 2026 11:51 IST

    అమరావతి: 39 పతకాలతో కామన్వెల్త్‌ గేమ్స్‌ను భారత్‌ అద్భుతంగా ముగించింది: పవన్‌

    • ఇది మన క్రీడాకారుల సంకల్పం, పోరాట పటిమకు నిదర్శనం: డిప్యూటీ సీఎం పవన్‌

    • ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని మోసుకెళ్లిన ప్రతి క్రీడాకారుడు భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారు: పవన్‌

  • Aug 03, 2026 11:50 IST

    జైలుకు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతం

    • జార్ఖండ్‌లో వెలుగు చూసిన ఘటన

    • సాహిబ్‌గంజ్ జైలుకు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నం

    • పోలీసు తుపాకీ లాక్కుని పారిపోయే ప్రయత్నం

    • పోలీసులు కాల్పులు జరపడంతో మృతి

  • Aug 03, 2026 11:42 IST

    ఏపీ పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీ రావు బదిలీ

    • అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఢిల్లీరావు నియామకం

    • ఏపీ పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీగా కన్నబాబుకు అదనపు బాధ్యతలు

  • Aug 03, 2026 11:37 IST

    మంచిర్యాల: లక్షెట్టిపేటలో ధాన్యం వ్యాపారి శ్రీధర్ ఇంటిపై రైతుల దాడి

    • వ్యాపారి ఇంట్లో గృహోపకరణాలకు నిప్పుపెట్టిన రైతులు

    • గతంలో రైతులకు రూ.కోట్లలో ధాన్యం డబ్బు ఎగ్గొట్టి పరారైన వ్యాపారి

  • Aug 03, 2026 11:37 IST

    భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

    • 37.8 అడుగుల వద్ద 7,13,165 క్యూసెక్కుల ప్రవాహం

  • Aug 03, 2026 11:37 IST

    లైంగిక వేధింపుల కేసు.. నిర్దోషిగా రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్

    • బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు

    • మరో నిందితుడు వినోద్ తోమర్‌ను కూడా నిర్దోషిగా ప్రకటన

    • సరైన సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు

    • బాధితుల వాంగ్మూలాల్లో వ్యత్యాసం ఉందంటూ కేసును కొట్టేసిన కోర్టు

  • Aug 03, 2026 11:26 IST

    సికింద్రాబాద్‌: బోనాల వివాదంపై MLA తలసాని వివరణ

    • జోగినిలకు అవమానం జరిగిన మాట వాస్తవం: తలసాని

    • జనం పెద్దసంఖ్యలో రావడం వల్లే ఇబ్బందులు: తలసాని

    • జోగినిలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నా: తలసాని

    • జోగినిలకు క్షమాపణలు చెబుతున్నా: MLA తలసాని

    • పండుగలకు కులమతాలు ఆపాదించొద్దు: తలసాని

  • Aug 03, 2026 11:17 IST

    CRDA ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష

    • హాజరైన AGICL ఎండీ అభిషేక్, ఇంజినీర్ ఇన్‌చీఫ్ గోపాలరెడ్డి, చీఫ్ ఇంజినీర్లు

    • అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న ఐకానిక్ భ‌వ‌నాల ప‌నుల‌ పురోగ‌తిపై చర్చ

    • అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ట‌వ‌ర్ల ప‌నుల తీరును తెలుసుకున్న మంత్రి

    • నిర్ధేశిత ల‌క్ష్యాల మేర‌కు ప‌నుల‌ను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాల‌ని మంత్రి సూచన

  • Aug 03, 2026 11:17 IST

    అనంతపురం: ఉరవకొండలో వైసీపీ నేతల అత్యుత్సాహం

    • ధర్నా పేరుతో అరాచకం సృష్టించిన వైసీపీ నేతలు

    • ప్రభుత్వాస్పత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లను రోడ్లపైకి తెచ్చి నిరసన

    • వైసీపీ మాజీ MLA విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

  • Aug 03, 2026 11:15 IST

    ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12:00 గంటలకు వాయిదా

    • పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసనలు

  • Aug 03, 2026 11:14 IST

    విజయవాడ: జగన్ పోస్ట్‌కు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్

    • టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ MLA దాడి చేస్తే జగన్ సమర్థిస్తున్నారు: బుద్ధా వెంకన్న

    • అరెస్ట్‌ను ఖండిస్తూ జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం సిగ్గుచేటు: బుద్ధా వెంకన్న

    • ఎవరి ఇళ్లపై దాడి చేసినా పోలీసులు అరెస్ట్ చేయకూడదా?: బుద్ధా వెంకన్న

    • MLAకు ఒక చట్టం.. సామాన్యుడికి ఒక న్యాయం ఉండదు జగన్ అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి జగన్: బుద్దా వెంకన్న

  • Aug 03, 2026 10:53 IST

    బిహార్: 3వ రౌండ్‌లో కూడా బిహార్ బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

    • 1,162 ఓట్ల ముందంజలో ఉన్న జనసురాజ్ నేత

    • మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ నేత నీరజ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

  • Aug 03, 2026 10:50 IST

    ఢిల్లీ: మహిళా రెజ్లర్ల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు

    • బ్రిజ్‌భూషణ్, వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా తేల్చిన కోర్టు

    • లైంగిక వేధింపుల కేసులో తీర్పు వెలువరించిన కోర్టు

  • Aug 03, 2026 10:41 IST

    పల్నాడు: కారంపూడి SI వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

    • ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న SI

    • 4 రోజుల పాటు స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని ఆరోపణ

    • కోర్టులో భార్య పిటిషన్‌ వేయడంతో బయటకు వచ్చిన భర్త

    • మరోసారి దంపతులను స్టేషన్‌కు పిలిచి కొట్టినట్టు SIపై ఆరోపణలు

  • Aug 03, 2026 10:36 IST

    పార్లమెంట్‌లో విపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం

    • హాజరైన రాహుల్, ఖర్గే, అఖిలేష్‌, ఇండియా కూటమి నేతలు

    • పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చ

  • Aug 03, 2026 10:34 IST

    సికింద్రాబాద్: మహంకాళి ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల ఆగ్రహం

    • అవసరం వచ్చినప్పుడే ప్రభుత్వానికి జోగినిలు గుర్తొస్తారు: శ్యామల

    • ఆలయంలో జోగినిలకు కనీస ఏర్పాట్లు చేయలేదు: శ్యామల

    • పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి: జోగిని శ్యామల

    • సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినిలను అవమానించారు: శ్యామల

  • Aug 03, 2026 10:15 IST

    సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో రంగం

    • భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

    • నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చా: స్వర్ణలత

    • మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి?: స్వర్ణలత

    • మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా?: స్వర్ణలత

    • ఇప్పటివరకు నా విగ్రహ ప్రతిష్ఠ చేయడం లేదు: స్వర్ణలత

  • Aug 03, 2026 10:10 IST

    శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీ

    • గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన బుమ్రా

    • జమ్ముకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి అవకాశం కల్పించిన బీసీసీఐ

  • Aug 03, 2026 09:56 IST

    హైదరాబాద్: బంజారాహిల్స్‌లో బాలికకు వేధింపులు

    • బాలిక ఫొటోలు, వీడియోలు SMలో పోస్ట్ చేసిన యువకుడు

    • వీడియోలు తొలగించాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్

    • మద్యం మత్తులో బాలికపై దాడికి యత్నించిన యువకుడు

    • బంజారాహిల్స్ పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు

    • యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

  • Aug 03, 2026 09:49 IST

    బిహార్: బంకీపూర్ అసెంబ్లీ బైపోల్‌లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం

    • బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై ఆధిక్యంలో ప్రశాంత్‌ కిషోర్

    • తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో జన్‌సురాజ్ పార్టీ చీఫ్‌ పీకే

  • Aug 03, 2026 09:42 IST

    సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర జోగినిల ధర్నా

    • నిన్న బోనాల వేడుకలో జోగినిలను అవమానించారని ఆగ్రహం

    • బారికేడ్లు తోసుకుంటూ ఆలయంలోకి ప్రవేశించిన జోగినిలు

    • జోగినిల ఆందోళనతో ఆలస్యంగా రంగం కార్యక్రమం

    • జోగినిలను చర్చలకు పిలిచిన మంత్రి పొన్నం, ఉన్నతాధికారులు

  • Aug 03, 2026 09:39 IST

    నంద్యాల: ఎర్రగూడూరులో ఎలుగుబంటి సంచారం

    • ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన వాహనదారులు

    • కేకలు వేయడంతో పరారైన ఎలుగుబంటి

  • Aug 03, 2026 09:29 IST

    నిర్మల్: మామడ మండలం పోతారంలో పెద్దోళ్ల లింబాద్రి(50) దారుణహత్య

    • అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు

    • ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

  • Aug 03, 2026 09:18 IST

    సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో రంగం

    • ఆలయానికి చేరుకున్న మాతంగి స్వర్ణలత

    • భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత

    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

  • Aug 03, 2026 08:40 IST

    సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై అస్యభకర పోస్ట్

    • ఎక్స్‌లో తీవ్ర పదజాలంతో దూషించిన గుర్తు తెలియని వ్యక్తి

    • అభ్యంతరకర పోస్టును తీవ్రంగా పరిగణించిన అధికారులు

    • నెటిజన్‌పై ఐటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు

    • నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు

    • సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

  • Aug 03, 2026 08:39 IST

    జమ్మూకశ్మీర్: పుల్వామాలో భద్రతా బలగాల తనిఖీల్లో వ్యక్తి అరెస్ట్

    • ఉగ్రవాద అనుమానితుడు తౌసీఫ్ అహ్మద్ దార్‌ అరెస్ట్

  • Aug 03, 2026 08:38 IST

    ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గంజాయి కలకలం

    • 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

    • చాక్లెట్ బాక్సుల్లో గంజాయి స్మగ్లింగ్

    • నిందితుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు

  • Aug 03, 2026 08:37 IST

    పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో భారీ పేలుడు

    • 14 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • శాంతి ర్యాలీ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి

  • Aug 03, 2026 08:21 IST

    అమరావతి: నేడు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • Aug 03, 2026 08:16 IST

    ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న వరద ప్రవాహం

    • కొనసాగుతున్న ఒకటో ప్రమాద హెచ్చరిక

    • 13.50 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం

    • 12.26 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల

  • Aug 03, 2026 08:15 IST

    భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

    • 38.40 అడుగుల వద్ద 7,36,650 క్యూసెక్కుల నీటిప్రవాహం

  • Aug 03, 2026 08:12 IST

    సంగారెడ్డి: అమీన్‌పూర్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం

    • పలువురు మహిళల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన దంపతులు

    • ఇల్లు అమ్మి రాత్రికి రాత్రే దంపతులు శిరీష, సాంబశివరావు పరారీ

    • అమీన్‌పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

  • Aug 03, 2026 08:01 IST

    కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా

    • గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా విమర్శలు

    • కుల్‌దీప్ ప్రదర్శనను అందరూ చూస్తున్నారు: దాస్‌గుప్తా

    • కానీ భారత సెలెక్టర్లు మాత్రం చూడటం మానేశారు: దాస్‌గుప్తా

  • Aug 03, 2026 07:53 IST

    నంద్యాల: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    • ఇన్‌ఫ్లో 1.48 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో నిల్

    • జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రారంభంకాని విద్యుదుత్పత్తి

  • Aug 03, 2026 07:45 IST

    ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు: ప్రధానిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బాలిక తల్లి

    • క్షమాపణ చెప్పినా ఇంకా ఎఫ్‌ఐఆర్ వెనక్కు తీసుకోలేదని ఆవేదన

    • బాలికను క్షమించాలని ప్రధాని స్వయంగా చెప్పారన్న బాలిక తల్లి

  • Aug 03, 2026 07:40 IST

    ఢిల్లీ: ఉ.10:00 గంటలకు విపక్షాల సమావేశం

    • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఫ్లోర్ లీడర్ల భేటీ

    • పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

  • Aug 03, 2026 07:39 IST

    నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద

    • ఇన్‌ఫ్లో 24,784; ఔట్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు

  • Aug 03, 2026 07:38 IST

    మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్ట్‌ 27 గేట్లు ఎత్తివేత

    • ఇన్‌ఫ్లో 1.56 లక్షలు, ఔట్‌ఫ్లో 1.58 లక్షల క్యూసెక్కులు

    • 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి

  • Aug 03, 2026 07:38 IST

    తుంగభద్ర డ్యామ్‌కు పెరిగిన వరద

    • ఇన్‌ఫ్లో 39,134; ఔట్‌ఫ్లో 1,528 క్యూసెక్కులు

  • Aug 03, 2026 07:37 IST

    మంచిర్యాల: ఇందనపల్లిలో ఆదివాసీల ఆందోళన విరమణ

    • ఆదివాసులు, ఎమ్మెల్యేతో ITDA పీవో మంద మకరందు చర్చలు

    • తమ అదుపులో ఉన్న యువకులను వదిలిపెట్టిన ఫారెస్ట్‌ అధికారులు

    • బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న హామీతో ఆందోళన విరమణ

  • Aug 03, 2026 07:37 IST

    సికింద్రాబాద్‌: ధర్నాకు సిద్ధమైన జోగినిలు

    • ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉదయం 8:00 గంటలకు ధర్నా చేపడుతున్నట్లు ప్రకటన

    • తమ సమస్యలపై, ఎదురవుతున్న ఇబ్బందులపై నిరసన

  • Aug 03, 2026 07:36 IST

    సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో నేడు రంగం

    • ఉ.8:30కు భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత

    • అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తూ 'సాగానంపే'తో ముగియనున్న లష్కర్‌ బోనాలు

  • Aug 03, 2026 07:35 IST

    తెలంగాణలో చేప పిల్లల పంపిణీ పథకానికి అనుమతి

    • పథకం అమలు కోసం రూ.116 కోట్ల విడుదల

    • 90 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లల కొనుగోళ్లకు టెండర్లు పిలవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం

  • Aug 03, 2026 07:35 IST

    భద్రాచలం దగ్గర తగ్గిన గోదావరి ప్రవాహ ఉధృతి

    • 38.70 అడుగుల వద్ద 7,50,069 క్యూసెక్కుల నీటిప్రవాహం

    • రాజమండ్రి దగ్గర తగ్గిన గోదావరి వరద ప్రవాహం

    • ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న వరద ప్రవాహం

    • బ్యారేజ్‌ దగ్గర కొనసాగుతున్న ఒకటో ప్రమాద హెచ్చరిక

    • 13.50 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం

  • Aug 03, 2026 07:29 IST

    హైదరాబాద్‌లో పసిడి ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,190

    • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,150

  • Aug 03, 2026 07:21 IST

    గ్రీసులో ఢీకొట్టుకున్న రెండు బెల్ హెలికాప్టర్లు

    • పశ్చిమ ఏథెన్స్‌లోని పసాతాలో కార్చిర్చు ఆర్పుతుండగా ప్రమాదం

    • ఘటనలో ఇద్దరు పైలట్ల దుర్మరణం

  • Aug 03, 2026 07:21 IST

    టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్

    • భారత మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను నియమించిన బీసీసీఐ

    • శ్రీలంక పర్యటనతో బాధ్యతలు చేపట్టనున్న ఘోష్

    • ఇటీవల ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న టి.దిలీప్

  • Aug 03, 2026 07:06 IST

    నేడు 11వ రోజు పార్లమెంట్‌ సమావేశాలు

  • Aug 03, 2026 07:06 IST

    CJP తదుపరి వ్యూహంపై కీలక చర్చలు

    • విద్యార్థుల కేసులపై CJP కార్యాచరణకు సిద్ధం

    • CJP ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే యోచన

  • Aug 03, 2026 07:06 IST

    కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తత

    • కావేరి జలాలపై కొనసాగుతున్న వివాదం

    • పోటాపోటీగా రైతుల నిరసనలు

  • Aug 03, 2026 07:05 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు

    • నేడు ఐదోరోజు సిట్ కస్టడీకి సీఐ నాగరాజు

  • Aug 03, 2026 07:05 IST

    గ్లాస్గో: ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌

    • అత్యధికంగా 171 మెడల్స్‌తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

    • తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్‌ (110), కెనడా (62)

    • 13 స్వర్ణాలు సహా 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్

    • ఒకే ఒక కాంస్య పతకంతో 31వ స్థానంలో పాకిస్థాన్‌

    • 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌

  • Aug 03, 2026 07:05 IST

    స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ఫుడ్‌ డెలివరీ

    • బెంగళూరులో తొలిదశ సేవలకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధం

    • ఈ నెల 15లోగా సేవలు ప్రారంభించే అవకాశం

    • ఫ్లిప్‌కార్ట్‌ రెస్టారెంట్ల ఆన్‌బోర్డింగ్‌ ప్రారంభం

    • 10 శాతం కమిషన్‌తో రెస్టారెంట్లను ఆకట్టుకునే వ్యూహం

  • Aug 03, 2026 06:59 IST

    హోర్ముజ్‌ జలసంధిపై ఒప్పందం జరగబోతోంది: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • ఆ తర్వాత ఇరాన్‌ డీన్యూక్లియరైజేషన్‌పై డీల్‌ కుదురుతుంది: ట్రంప్

    • దాడులు ఆపాలని సౌదీ, UAE, ఖతార్‌, ఇరాన్‌ కోరాయి: డొనాల్డ్‌ ట్రంప్‌