Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 11 , 2026 | 05:52 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 11, 2026 21:21 IST

    ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్‌

    • 14 రోజుల రిమాండ్‌ విధించిన ED కోర్టు

    • చంచల్‌గూడ జైలుకు తరలింపు

    • లిక్కర్‌ రవాణా టెండర్లలో అవకతవకలపై కేసు

  • Jun 11, 2026 20:43 IST

    హైదరాబాద్‌: గురుకుల విద్యలో మరో విప్లవాత్మక అడుగు

    • TGSWREIS బోర్డ్‌ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయాలు

    • టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయాలు

    • అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య లక్ష్యం

    • డిగ్రీ కాలేజీల లెక్చరర్లకు UGC పే స్కేల్‌ అమలు దిశగా నిర్ణయం

    • డిగ్రీ కాలేజీలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటు

    • న్యాక్ గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    • విదేశీ విద్యకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం

    • మరో 9 సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

  • Jun 11, 2026 20:40 IST

    హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం

    • మంజీరా ఫేజ్‌-2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ

    • రుద్రారం దగ్గర అత్యవసర మరమ్మతులు

  • Jun 11, 2026 19:35 IST

    భారత్-ఎ జట్టుకు అఫ్గానిస్థాన్-ఎ షాక్

    • డీఎల్ఎస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో అఫ్గాన్ టీమ్ విజయం

    • యువ బ్యాటర్లు రాణించినా నిరాశపరిచిన భారత బౌలర్లు

    • 49 ఓవర్లలో 349 పరుగులు చేసిన భారత్-ఎ

    • వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించిన నిర్వాహకులు

  • Jun 11, 2026 19:14 IST

    ఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర@2047: సీఎం చంద్రబాబు

    • RTGS, Ai, 'అవేర్‌' వంటి టూల్స్‌తో ఏపీలో సాంకేతిక పాలన: సీఎం చంద్రబాబు

    • పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీ వద్దు: సీఎం చంద్రబాబు

    • స్థిరమైన విధానాలపై దృష్టిపెట్టాలి: సీఎం చంద్రబాబు

  • Jun 11, 2026 18:43 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం రేవంత్ భేటీ

    • హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2, మూసీ ప్రాజెక్టుపై చర్చ

  • Jun 11, 2026 18:43 IST

    ఢిల్లీ: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ

    • తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ

    • కీలక ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ చర్చ

    • పెండింగ్‌ అంశాలను ఆమోదించాలని కోరిన సీఎం రేవంత్

  • Jun 11, 2026 18:27 IST

    ఇరాన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

    • ఈ రాత్రి ఇరాన్‌పై తీవ్ర దాడులు చేస్తాం: ట్రంప్‌

    • ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

    • ఇరాన్‌ ఆయిల్‌ నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

    • చమురు, గ్యాస్‌ మార్కెట్లపై నియంత్రణ సాధిస్తాం: ట్రంప్

  • Jun 11, 2026 18:15 IST

    భారత నౌకపై అమెరికా దాడిలో విశాఖ వాసి మృతి

    • ధృవీకరించిన ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు

    • విశాఖకు చెందిన మెరైన్‌ ఇంజినీర్‌ సురేష్‌ పట్నాల మృతి

  • Jun 11, 2026 18:00 IST

    ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

    • రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన ED

    • లిక్కర్‌ రవాణా టెండర్లలో అవకతవకలపై కేసు

    • రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ప్రశ్నించి అరెస్టు చేసిన ED

    • ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి

  • Jun 11, 2026 17:35 IST

    దేశంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది: జగ్గారెడ్డి

    • మీనాక్షి నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారు: జగ్గారెడ్డి

    • కుట్రతో కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు దక్కనివ్వలేదు: జగ్గారెడ్డి

    • భారత్‌లో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు: జగ్గారెడ్డి

  • Jun 11, 2026 17:33 IST

    POKలో మళ్లీ పోలీసుల కాల్పులు, 16 మంది మృతి

    • మూడు రోజుల నుంచి POKలో ఘర్షణలు

    • మూడ్రోజుల్లో 50 మందికిపైగా మృతి, పలువురికి గాయాలు

    • పాక్‌ నుంచి విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు

    • రావ‌ల్‌కోట్‌, బింబేర్, ముజఫ‌రాబాద్‌లో నిరసనలు

  • Jun 11, 2026 17:33 IST

    అమరావతి: 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

    • 110 మల్టీ రిహాబిలిటేష‌న్‌ వర్కర్, ఫార్మసిస్టుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల

    • ఈ పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్న ప్రభుత్వం

    • జూన్ 13 నుంచి దరఖాస్తు ప్రారంభం

    • జూన్ 30వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ

  • Jun 11, 2026 17:29 IST

    దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు: టీపీసీసీ చీఫ్ మహేష్‌

    • నిత్యవసరాల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి: మహేష్‌

    • తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసులు లేవు: మహేష్‌

    • రాజకీయ కక్షతోనే మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించారు: మహేష్

  • Jun 11, 2026 17:27 IST

    ఈడీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే జగన్ అరోపణలు: ఎంపీ చింతకాయల విజయ్‌

    • తన వారంతా దొరుకుతుండటంతో జగన్‌ డైవర్షన్ పాలిటిక్స్: ఎంపీ విజయ్

    • ఈడీ దాడులతో జగన్‌కు భయం పట్టుకుంది: ఎంపీ విజయ్‌

    • కింగ్ పిన్‌గా తనదాకా వస్తుందనేదే జగన్ భయం: ఎంపీ విజయ్

    • కాక్రోచ్‌లు వచ్చేది జగన్ కోసమే: ఎంపీ విజయ్‌

  • Jun 11, 2026 17:13 IST

    AI అదుపు తప్పే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ

    • ఏదో తప్పు జరిగే అవకాశం ఉందన్న అమోడీ

    • AI అభివృద్ధిపై మరింత జాగ్రత్తగా ముందుకెళ్లాలని సూచించిన అమోడీ

    • AI సామాజిక ప్రభావాలపై పూర్తి అవగాహన వచ్చే వరకు అభివృద్ధి వేగం తగ్గించాలని సూచన

    • ప్రపంచవ్యాప్తంగా AI వ్యవస్థలకు కఠిన నియంత్రణలు అవసరమన్న అమోడీ

  • Jun 11, 2026 16:57 IST

    ఢిల్లీ: ఇవాళ సా.6 గంటలకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ

    • తెలంగాణ అభివృద్ధి, కీలక ప్రాజెక్టులపై చర్చించే అవకాశం

    • రాత్రి 7 గంటలకు కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ భేటీ

  • Jun 11, 2026 16:56 IST

    నేటి నుంచి జులై 19 వరకు ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌

    • ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికా, కెనడా, మెక్సికో

    • 16 నగరాల్లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు

    • రికార్డు స్థాయిలో బరిలో 48 దేశాల జట్లు

    • 12 గ్రూప్‌లుగా విడిపోయి ఆడనున్న 48 దేశాలు

    • డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి అర్జెంటీనా

    • నేడు తొలి మ్యాచ్‌లో మెక్సికో Vs సౌతాఫ్రికా

    • అర్ధరాత్రి 12.30 గంటల నుంచి మ్యాచ్‌

  • Jun 11, 2026 16:28 IST

    డీఎస్సీపై జగన్‌వి నిరాధార ఆరోపణలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

    • డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి: భూమిరెడ్డి

    • అభ్యంతరాల పరిశీలన అనంతరమే తుది ఎంపిక జాబితా విడుదల చేశాం: భూమిరెడ్డి

    • నిరుద్యోగ యువతను వైసీపీ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపణ

    • క్రీడాకోటా నియామకాలపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శ

    • వైసీపీ హయాంలో దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ

    • జగన్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని భూమిరెడ్డి సవాల్

  • Jun 11, 2026 16:25 IST

    హైదరాబాద్: రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష

    • రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి

    • ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

    • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: మంత్రి

    • ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో కార్యాలయాల నిర్మాణం: మంత్రి

    • అద్దె, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలకు శాశ్వత పరిష్కారం: మంత్రి

    • నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు, పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం

  • Jun 11, 2026 16:13 IST

    హైదరాబాద్: అమీన్‌పూర్‌లో ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసం

    • వాట్సాప్ లింక్ క్లిక్ చేసి మోసగాళ్ల వలలో చిక్కుకున్న వ్యక్తి

    • పలు దఫాల్లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితుడు

    • నమ్మకం కల్పించేందుకు రూ.1.5 లక్షలు తిరిగి పంపిన సైబర్ నేరగాళ్లు

    • చివరకు రూ.48.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

    • సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించిన బాధితుడు

  • Jun 11, 2026 16:11 IST

    లడఖ్‌లోని నుబ్రా–పాంగాంగ్ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ రద్దీ

    • సన్నని రహదారిపై కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలు

    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్రాఫిక్ వీడియో

  • Jun 11, 2026 15:59 IST

    ఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: కేసీ వేణుగోపాల్‌

    • ప్రజా సమస్యలపై దేశవ్యాప్త ఆందోళనకు నిర్ణయం: కేసీ వేణుగోపాల్‌

    • మూడు నెలలపాటు దేశవ్యాప్త ఆందోళనలు: కేసీ వేణుగోపాల్‌

    • కాంగ్రెస్‌లో TMC విలీనం పుకార్లు మాత్రమే: కేసీ వేణుగోపాల్‌

    • FIR లేకపోయినా మీనాక్షి నటరాజన్‌ నామినేషన్ తిరస్కరణ: జైరాం రమేష్‌

    • మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశంతోనే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ: జైరాం రమేష్‌

  • Jun 11, 2026 15:58 IST

    ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం

    • నాలుగు నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం

    • టీడీపీ నుంచి సానా సతీష్‌, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ ఎన్నిక

    • జనసేన నుంచి లింగమనేని రమేష్ ఎన్నిక

  • Jun 11, 2026 15:57 IST

    ఢిల్లీ: ఇందిరాభవన్‌లో ముగిసిన కాంగ్రెస్ నేతల సమావేశం

    • దేశవ్యాప్త ఆందోళనలపై 3-4 రోజుల్లో AICC కార్యాచరణ

    • మీనాక్షి నటరాజన్‌ నామినేషన్ తిరస్కరణపై రాజకీయ పోరాటం: కేసీ వేణుగోపాల్‌

  • Jun 11, 2026 15:52 IST

    స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 151 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 53 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 11, 2026 15:51 IST

    హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ EPC పనులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • EPC ప్రాజెక్టుల కమిటీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ ఆమోదం

    • అదనపు కమిషనర్ స్థానంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు కన్వీనర్ బాధ్యతలు

    • చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) సభ్యుడిగా కమిటీకి గ్రీన్ సిగ్నల్

  • Jun 11, 2026 15:35 IST

    మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్

    • రాజ్యసభ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక

    • మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం

  • Jun 11, 2026 15:34 IST

    మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్సే వెన్నుపోటు పొడిచింది: హరీష్‌రావు

    • మధ్యప్రదేశ్‌ మంత్రికి లీక్‌ ఇచ్చిన టి.కాంగ్రెస్‌ నేత ఎవరు?: హరీష్‌

    • లీక్‌పై సిట్‌ లేదా జ్యుడిషియల్‌ విచారణ వేస్తారా?: హరీష్‌రావు

    • సీఎం రేవంత్‌ చెప్పిన వ్యక్తికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వలేదు: హరీష్‌రావు

    • ఆ వ్యక్తే మధ్యప్రదేశ్‌ మంత్రికి సమాచారం అందించి ఉంటారు: హరీష్‌

  • Jun 11, 2026 15:32 IST

    తెలంగాణలో భిన్న వాతావరణం

    • నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

    • ఉత్తర తెలంగాణలో కొనసాగుతున్న హీట్‌వేవ్

    • తెలంగాణలో రుతుపవనాల విస్తరణకు మరింత సమయం

    • రైతులు విత్తనాలు వేసేముందు జాగ్రత్త పడాలి: వాతావరణశాఖ

  • Jun 11, 2026 15:32 IST

    మాజీమంత్రి కారుమూరి నివాసంలో ముగిసిన ED సోదాలు

    • కారుమూరి నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ED

  • Jun 11, 2026 15:31 IST

    ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీకి వినతిపత్రం అందజేసిన ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ

    • రిక్రూట్‌మెంట్, ఐఆర్‌, పీఆర్సీ, బస్సుల కొనుగోలుపై జేఏసీ డిమాండ్

    • స్త్రీశక్తి పథకంతో పెరిగిన వర్క్‌లోడ్ తగ్గించాలని వినతి

    • ఈనెల 16 నుంచి 26 వరకు ఉద్యమ సమాయత్త సభలు

    • 26, 27 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు, ధర్నాలు

    • జూన్ 28న తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న జేఏసీ

  • Jun 11, 2026 15:29 IST

    మ్యాచ్‌ మధ్యలో పీవీ సింధుకు అండగా నిలిచిన భర్త వెంకట దత్త సాయి

    • సిడ్నీలో మ్యాచ్ సందర్భంగా ఇబ్బంది పడిన సింధుకు ధైర్యం చెప్పిన సాయి

    • బాక్స్‌లోకి వచ్చి సింధును ప్రోత్సహించిన వెంకట దత్త సాయి

    • ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించిన పీవీ సింధు

    • స్పోర్ట్స్‌ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న వెంకట దత్త సాయి

    • దంపతుల అనుబంధంపై అభిమానుల ప్రశంసలు

  • Jun 11, 2026 15:24 IST

    ఐదుగురు మహిళా WWE రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌

    • గోప్యతకు భంగం కలిగిందంటూ ఆందోళన వ్యక్తం చేసిన రెజ్లర్లు

    • సమ్మతి లేకుండా వ్యక్తిగత చిత్రాలు ప్రచారంలోకి రావడంపై అభ్యంతరం

    • మహిళా రెజ్లర్ల ప్రైవసీ రక్షణపై మళ్లీ చర్చ

    • సైబర్ భద్రత, వ్యక్తిగత డేటా పరిరక్షణపై ప్రశ్నలు

  • Jun 11, 2026 14:44 IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై జగన్ రాజకీయాలు చేస్తున్నారు: ఎంపీ అప్పలనాయుడు

    • స్టీల్ ప్లాంట్ సంక్షోభానికి జగన్ పాలనే కారణమని ఆరోపణ

    • నాడు ప్లాంట్‌ను బలహీనపరిచి.. నేడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని వ్యాఖ్య

    • బాధితులను పరామర్శించే పేరుతో కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపాటు

    • స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అప్పలనాయుడు

  • Jun 11, 2026 14:43 IST

    యూరియా సమస్యపై నిజామాబాద్ కలెక్టర్‌ను కలిసిన బీజేపీ బృందం

    • కేంద్రం నుంచి యూరియా కొరత లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ వ్యాఖ్య

    • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణ

    • రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కలెక్టర్‌కు వినతి

    • యూరియా పంపిణీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

  • Jun 11, 2026 14:42 IST

    ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నం

    • ఇటీవల ఎమ్మెల్యే బాలరాజుపై సోషల్ మీడియాలో నిందితుడు వంశీ దుష్ప్రచారం

    • వంశీని పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు

    • ఇవాళ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వంశీ

    • అప్రమత్తమైన గన్‌మెన్, సిబ్బంది.. వంశీని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగింత

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన జీలుగుమిల్లి పోలీసులు

  • Jun 11, 2026 14:37 IST

    విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై NHRC ఆగ్రహం

    • సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC

    • ఏపీ సీఎస్‌కు NHRC నోటీసులు

    • భద్రతా లోపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

    • గాయపడ్డ కార్మికుల పరిస్థితిపై NHRC ఆరా

  • Jun 11, 2026 14:18 IST

    అఫ్గాన్‌-ఏ టార్గెట్ 350 పరుగులు

    • అర్ధ సెంచరీలతో అలరించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66)

    • 5 వికెట్లతో రాణించిన అబ్దుల్ అహ్మద్జాయ్, 3 తీసిన ఫర్మానుల్లా షఫీ

  • Jun 11, 2026 13:36 IST

    ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత

    • రూ.2.43కోట్ల విలువైన 6.94 కిలోల గంజాయి స్వాధీనం

    • బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్

  • Jun 11, 2026 13:22 IST

    అమెరికా దుశ్చర్యపై భారత్ తీవ్ర నిరసన

    • ఒమన్ తీరంలో నౌకపై దాడి చేసిన అమెరికా దళాలు

    • అమెరికా మిస్సైల్స్ దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి

    • మృతులు ఆదిత్యశర్మ, శివానంద్, సురేష్‌గా గుర్తింపు

    • దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులు

    • 21 మంది భారతీయులను రక్షించిన ఒమన్ సైన్యం

  • Jun 11, 2026 13:17 IST

    49 ఓవర్లకు కుదించిన భారత్, అఫ్గాన్‌ మ్యాచ్

    • వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం

    • ఇప్పుడు వర్షం తగ్గడంతో ఆట పునఃప్రారంభం

    • ప్రస్తుతం భారత్‌- ఏ స్కోరు 36 ఓవర్లకు 238/3

    • క్రీజ్‌లో తిలక్ వర్మ (32*), రుతురాజ్‌ గైక్వాడ్ (63*)

  • Jun 11, 2026 12:53 IST

    ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్‌

    • టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న టీమిండియా

    • భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య పాయింట్ల వ్యత్యాసం తగ్గుదల

    • భారత్‌ రేటింగ్‌ పాయింట్లు 119 నుంచి 118కి తగ్గింపు

    • 113 పాయింట్లతో రెండో స్థానంలో న్యూజిలాండ్‌

    • 109 పాయింట్లతో మూడో స్థానంలో ఆస్ట్రేలియా

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 12:45 IST

    సంతకాల ఫోర్జరీ కేసులో అభిషేక్‌ బెనర్జీకి ఊరట

    • మూడు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పించిన కోర్టు

    • కేసులో తదుపరి విచారణ వరకూ ఉపశమనం

    • ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం

    • బెంగాల్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కేసు

  • Jun 11, 2026 12:43 IST

    116 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

    • పోలవరం: ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద పోలీసుల తనిఖీలు

    • కారులో అక్రమంగా తరలిస్తున్న 116 కేజీల గంజాయి పట్టివేత

    • ఒడిశాకు చెందిన ఇద్దరి అరెస్టు.. మరో ముగ్గురి పరారీ

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 11, 2026 12:41 IST

    పల్నాడు : వైసీపీ నేత తురగా కిషోర్‌పై మాచర్ల పీఎస్‌లో కేసు నమోదు

    • నకిలీ ఇళ్ల పట్టాలతో మోసం చేసిన ఘటనలో బాధితుల ఫిర్యాదుతో కేసు

    • రూ.4.50 లక్షలు తీసుకుని నకిలీ పట్టా ఇచ్చారని ఎమ్మెల్యేకు ఇద్దరు బాధితుల ఫిర్యాదు

  • Jun 11, 2026 12:05 IST

    కర్నూలు: గోనెగొండ్ల మండలం బైలుప్పాల గ్రామంలో విషాద ఘటన

    • బకెట్‌లోని వాటర్ హీటర్‌‌ను పట్టుకొని రిషి (6) అనే బాలుడి మృతి

    • కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టిన గోనెగొండ్ల పోలీసులు

  • Jun 11, 2026 12:02 IST

    ఢిల్లీ: ముదురుతున్న TRS టైటిల్ వివాదం

    • రంగంలోకి మహారాష్ట్ర పార్టీ

    • కవిత ప్రకటన కంటే ముందే 'TRS' పేరు కోసం ఈసీని ఆశ్రయించిన సోలాపూర్ నేతలు

    • TRS పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ కవిత ఇచ్చిన యాడ్‌పై ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

    • కవిత పార్టీ పేరుపై BRS నుంచి కూడా తీవ్ర అభ్యంతరం

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 11:59 IST

    ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అరెస్ట్

    • లిక్కర్ స్కామ్‌ కేసులో జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    • ఒకేసారి పది ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు

    • లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు కొట్టేసిన జగన్ అండ్ గ్యాంగ్

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 11:56 IST

    ఢిల్లీ: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంలో దక్కని ఊరట

    • మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ జరిపేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

    • తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు

    • నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మీనాక్షి

  • Jun 11, 2026 11:54 IST

    ఢిల్లీ: ఇందిరాభవన్‌లో AICC ఉన్నతస్థాయి సమావేశం

    • హాజరైన AICC ఇన్‌చార్జ్‌లు, జనరల్ సెక్రటరీలు, PCC అధ్యక్షులు

    • పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చర్చ

  • Jun 11, 2026 11:53 IST

    తమిళనాడు: DMK కూటమి నుంచి వైదొలిగిన సీపీఐ

    • ప్రస్తుత పరిస్థితుల్లో DMK కూటమిలో కొనసాగలేం: సీపీఐ నాయకుడు వీరపాండియన్

  • Jun 11, 2026 11:49 IST

    తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    • ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

    • tgbie.cgg.gov.in, results.cgg.gov.inలో ఫలితాలు

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 11:24 IST

    తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు

    • లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సోదాలు చేస్తున్న ఈడీ

    • హైదరాబాద్‌లో 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు

    • హవాలా, మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు ఆరోపణలు

    • లిక్కర్ స్కామ్‌ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి చెందిన ఇళ్లల్లో సోదాలు చేస్తున్న ఈడీ

  • Jun 11, 2026 11:22 IST

    వికారాబాద్ జిల్లా: పరిగిలో లారీని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

    • అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కిన కారు

    • ముందు వెళ్తున్న బైకును తప్పించబోయి.. లారీని ఢీకొన్న కారు

    • స్వల్ప గాయాలతో బయట పడ్డ కారు యజమాని

  • Jun 11, 2026 11:19 IST

    పంజాబ్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత

    • 30కిలోల హెరాయిన్ సీజ్, ఆరుగురి అరెస్ట్

  • Jun 11, 2026 11:18 IST

    జోర్డాన్‌పై మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతిదాడులు

    • అల్ అజ్రాక్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా ఇరాన్ దాడులు

    • జోర్డాన్‌లోని కమాండ్ సెంటర్ ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటన

    • భారీ సంఖ్యలో ఫైటర్‌ జెట్లు ధ్వంసమయ్యాయన్న ఇరాన్

  • Jun 11, 2026 11:16 IST

    భావోద్వేగంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: నాసర్

    • బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ నాసర్ హుస్సేన్ సూచన

    • స్టోక్స్ ఇంగ్లండ్‌కు చాలా కాలం అండగా నిలిచాడు: నాసర్

    • అతడు ఇంగ్లండ్ కోసం యోధుడిలా పోరాడాడు: నాసర్

  • Jun 11, 2026 11:12 IST

    టీఎంసీకి మరో షాక్‌.. రాజ్యసభ సభ్యత్వానికి ప్రకాశ్‌ చిక్‌ బరైక్‌ రాజీనామా

    • గురువారం తన పదవికి రాజీనామా చేసిన టీఎంసీ ఎంపీ

    • పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం మధ్య కీలక పరిణామం

    • టీఎంసీలో అసంతృప్తి, విభేదాలపై మరింత చర్చ

    • వరుస రాజీనామాలతో పార్టీ నాయకత్వానికి సవాళ్లు

    • బెంగాల్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన తాజా పరిణామం

  • Jun 11, 2026 10:59 IST

    ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతికి ప్రధాని మోదీ నివాళి

    • భారతీరాజా మృతి చాలా విచారకరం: ప్రధాని మోదీ

    • భారతీరాజా సినిమాలు.. తమిళ సినిమా రూపురేఖలనే మార్చేశాయి: ప్రధాని మోదీ

    • గ్రామీణ జీవితాన్ని ఆయన చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం: ప్రధాని మోదీ

  • Jun 11, 2026 10:54 IST

    హైదరాబాద్: కొండాపూర్‌లో మెడికల్ కౌన్సిల్ దాడులు

    • నియో స్కిన్ క్లినిక్, ORI ఏసైటిక్స్, త్రాయ హెయిర్ కేంద్రాల్లో సోదాలు

    • నిబంధనలు ఉల్లంఘించి వైద్య సేవలందిస్తున్నట్టు గుర్తింపు

    • NMC చట్టం సెక్షన్ 34, 54 కింద చర్యలు చేపట్టిన అధికారులు

    • అనధికార క్లినిక్‌ల సీలింగ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరిక

  • Jun 11, 2026 10:46 IST

    టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ

    • జాతీయ జట్టులో చేరడంతో ఎమోషనల్ అయిన వైభవ్ తండ్రి సంజీవ్

    • వైభవ్ క్రికెట్ కోసం భూములు అమ్ముకున్న సంజీవ్

    • ఆస్తులు పోయినా.. వైభవ్‌కు వస్తున్న గుర్తింపు సంతోషాన్ని ఇస్తోంది: సంజీవ్

    • ఆస్తుల కంటే వైభవ్ సాధించే కీర్తే చాలా గొప్పది: సంజీవ్

    • దేశం కోసం ఆడాలనే కసితో వైభవ్ పని చేశాడు: సంజీవ్

    • నేడు వైభవ్‌కు ఆ అవకాశం వచ్చింది: సంజీవ్

  • Jun 11, 2026 10:38 IST

    కామారెడ్డిలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడి బలి

    • బెట్టింగ్‌లో రూ.12లక్షలు కోల్పోయిన క్రాంతి అనే యువకుడు

    • ఇందిరానగర్ చర్చి వెనుక ఉరేసుకుని క్రాంతి ఆత్మహత్య

    • 6 నెలలుగా బెట్టింగ్‌కు బానిసై అప్పులు చేసిన క్రాంతి

  • Jun 11, 2026 10:36 IST

    విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు

    • లాడిల్‌కు రంధ్రం పడి నేలపాలైన ఉక్కు ద్రవం

    • ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

    • స్టీల్‌ప్లాంట్ SMS-1లో చోటు చేసుకున్న ఘటన

  • Jun 11, 2026 10:17 IST

    కామారెడ్డిలో మిస్సింగ్ కలకలం

    • తల్లితో పాటూ ముగ్గురు చిన్నారుల అదృశ్యం

    • కామారెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బంధువులు

    • అదృశ్యమైన తల్లి లయ, పిల్లలు బిందు, శివ, దివిజ

  • Jun 11, 2026 10:10 IST

    ఖమ్మం: వైరా రోడ్డులోని సోనోవిజన్‌లో భారీ చోరీ

    • రూ.90లక్షల విలవైన ఫోన్ల అపహరణ

    • షట్టర్‌ తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు

  • Jun 11, 2026 10:09 IST

    ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్రం

    • 22-30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత

    • పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం ప్రోత్సాహకానికి చర్యలు

    • ఇంధన ప్రమాణాలను ఇటీవలే నోటిఫై చేసిన కేంద్రం

    • ప్రస్తుతం పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలిపి విక్రయం

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 10:05 IST

    నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

    • సెన్సెక్స్ 240, నిఫ్టీ 70 పాయింట్లకుపైగా నష్టం

    • డాలర్‌తో పోలిస్తే 95.56కి చేరిన రూపాయి మారకం విలువ

  • Jun 11, 2026 09:50 IST

    కర్నూలు చిన్నారి మానస ఆవేదనపై స్పందించిన మంత్రి లోకేష్

    • హాస్టల్ సీటు ఇప్పించి, మానస చదువుకు అండగా ఉంటానని లోకేష్‌ హామీ

    • KGBVలో 6వ తరగతి హాస్టల్ సీటు రాకపోవడంపై సోషల్ మీడియాలో నేరేడుప్పల వాసి పోస్ట్

    • తల్లిదండ్రులు వలస వెళ్తుండడంతో చదువు ఆగిపోతుందని ఆవేదన

    • విషయం తెలుసుకుని సమస్య పరిష్కరించిన మంత్రి నారా లోకేష్

    పూర్తి కథనం..

  • Jun 11, 2026 07:57 IST

    గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

    • మరో 3 గంటల పాటు ఉరుములు, మెరుపులతో వర్షం

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన

  • Jun 11, 2026 07:36 IST

    సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం

    • సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో 5.4 సెం. మీ వర్షపాతం నమోదు

    • మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో 2 సెం. మీ వాన

  • Jun 11, 2026 07:21 IST

    నేడు పుణేలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు

    • ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్

    • జూన్‌ 20లోగా ధర్మేంద్ర రాజీనామా చేయాలి-CJP

  • Jun 11, 2026 07:20 IST

    ఈ నెల 14 నుంచి 16 వరకూ ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు

    • పార్టీ నేతలతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • సేన గళం కార్యక్రమం ఉద్దేశాలను ప్రజలకు వివరించనున్న పవన్‌

    • సుమారు 150 మంది జనసేన ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం

  • Jun 11, 2026 07:08 IST

    మెక్సికో: నేటి నుంచి ఫిఫా వరల్డ్‌ కప్‌

    • విశ్వ సాకర్‌ సంగ్రామానికి సర్వం సిద్ధం

    • తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మెక్సికో ఢీ

  • Jun 11, 2026 07:01 IST

    హోర్ముజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్‌

    • ప్రస్తుత దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటన

    • హెచ్చరికలు పక్కనపెట్టి హోర్ముజ్‌ దాటితే దాడులు తప్పవన్న ఇరాన్‌

  • Jun 11, 2026 07:00 IST

    రేపు హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

    • మోదీ 12 ఏళ్ల పాలన విజయాలపై ప్రచారం

  • Jun 11, 2026 07:00 IST

    విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ టాప్‌

    • 20.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానం

  • Jun 11, 2026 07:00 IST

    హైదరాబాద్: నేడు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    • ఉదయం 11:30కు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు

  • Jun 11, 2026 06:59 IST

    చెన్నై: నేడు దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు

    • ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

  • Jun 11, 2026 06:29 IST

    విజయవాడ: నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం

    • లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన‌ నీరు

  • Jun 11, 2026 05:54 IST

    హైదరాబాద్‌: ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌

    • రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • Jun 11, 2026 05:54 IST

    ఢిల్లీలో రేపు కాంగ్రెస్ అత్యవసర సమావేశం

    • AICC చీఫ్ ఖర్గే అధ్యక్షతన సమావేశం

    • పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు హాజరుకావాలని ఆదేశం

  • Jun 11, 2026 05:52 IST

    నేడు సోనియా, రాహుల్‌ను కలవనున్న సీఎం విజయ్‌

    • ఇండియా కూటమిలోకి విజయ్‌ను ఆహ్వానించే అవకాశం

    • రేపు నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్న విజయ్‌

  • Jun 11, 2026 05:52 IST

    రేపు నీతిఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ సమావేశం

    • కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం