ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:55 AM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి, జూన్ 11: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ.. విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు పది చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్, మద్యం రవాణా కేసుల్లో రాజ్ కసిరెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడలోని సిట్ నాలుగు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో జగన్ అండ్ గ్యాంగ్ వేల కోట్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. జే బ్రాండ్స్ విషంతో ప్రజల ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్‌లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటంతో.. త్వరలోనే జగన్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు
Read Latest AP News And Telugu News