హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:09 AM
హైదరాబాద్‌లో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. క్యూనెట్ పేరుతో అమాయకులను మోసం చేసిన ముఠాను సీసీఎస్ పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్‌లో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. క్యూనెట్ పేరుతో అమాయకులను మోసం చేసిన ముఠాను సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నిరుద్యోగ యువతతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చంటూ మాయమాటలతో ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ కార్యాలయంలో నిందితులను ఈరోజు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించనున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి...
‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి
ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి విక్రయం.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News