Share News

ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి విక్రయం.. నిందితుడి అరెస్ట్

ABN , Publish Date - Jun 11 , 2026 | 10:47 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపనపల్లిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ గేటు ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి విక్రయం.. నిందితుడి అరెస్ట్
Hyderabad Ganja Case

హైదరాబాద్, జూన్ 11: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపనపల్లిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ గేటు ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా.. అతడి వద్ద ఉన్న బ్యాగులో గంజాయిని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి కేజీన్నర గంజాయిని, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బికాశ్ బైక్‌గా గుర్తించారు.


బికాశ్.. గోపనపల్లిలో ఉంటూ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. తరచూ ఒరిస్సా నుంచి గంజాయిని తెచ్చి ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గంజాయిని, నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు శేరిలింగంపల్లి ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

రూ.కోటి పరిహారం ఇవ్వాలి

‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 11:12 AM