‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి
ABN , Publish Date - Jun 11 , 2026 | 09:44 AM
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి మానస ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మానస చదువుకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నెరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె మానస.. తనను చదివించాలంటూ లోకేశ్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వేడుకుంది.
అమరావతి, జూన్ 11: కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి మానస ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మానస చదువుకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నెరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె మానస.. తనకు చదవుకునేందుకు హాస్టల్‌లో సీటు ఇప్పించాలంటూ లోకేశ్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వేడుకుంది. 5వ తరగతి పూర్తయ్యాక కేజీబీవీ (KGBV) పాఠశాలలో సీటు కోసం చిన్నారి అప్లై చేసింది. అయితే అందులో సీటు రాకపోవడంతో చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, తల్లిదండ్రులు వలస వెళ్తుండటంతో తన చదువు ఆగిపోతుందని ‘లోకేష్ మామా’ అంటూ మాసన వేడుకుంది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. చిన్నారి దీనస్థితిపై మంత్రి వెంటనే స్పందించారు.
ఈ విషయంలో విచారించాల్సిందిగా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ సీటు ఇప్పించి, మానస చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటూ’ చిన్నారికి మంత్రి లోకేశ్ ఆశీస్సులు అందజేశారు. తన దీనస్థితిపై స్పందిస్తూ.. చదువుకునే అవకాశం కల్పించడంతో చిన్నారి మానస, ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ.. లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
అమెరికా దాడులు.. హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
Read Latest AP News And Telugu News