అమెరికా దాడులు.. హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:29 AM
ఇరాన్‌పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది. టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది.
టెహ్రాన్, జూన్ 11: ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు చేస్తోంది. ఇరాన్‌పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది. టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం పేర్కొంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలించామని తెలిపారు. హోర్ముజ్ ద్వారా 200 నౌకలు సురక్షితంగా తరలించామన్నారు.
హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాలలోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికాకు చెందిన 18 కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌జీసీ కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. అమెరికా దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. హెచ్చరికలు పక్కనపెట్టి హోర్ముజ్ దాటితే దాడులు తప్పవని హెచ్చరించింది.
నౌకలపై అమెరికా దాడులు..
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం అమెరికా ఎంట్రీతో దారుణ పరిస్థితులకు దారి తీసింది. ఇప్పుడు ఇరాన్, అమెరికా దేశాల మధ్య వార్ జరుగుతోంది. హోర్ముజ్ మీద ఆధిపత్యం కోసం రెండు దేశాలు గొడవపడుతున్నాయి. శాంతి చర్చలు సఫలం అవ్వటం లేదు. హోర్ముజ్ జలసంధి, ఒమన్ తీరప్రాంతంలో తమ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ చమురును రవాణా చేస్తున్న విదేశీ నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేస్తోంది. ఈ విదేశీ నౌకలలో పనిచేస్తున్న భారతీయ నావికులు దాడుల వల్ల ప్రమాదంలో పడుతున్నారు. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా తాజాగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు.
ఇవి కూడా చదవండి
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..