Share News

హన్మకొండలో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 09:34 AM

హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సురారం గ్రామంలో గత మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హన్మకొండలో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు
Hanamkonda Bear News

హన్మకొండ, జూన్ 11: జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సురారం గ్రామంలో మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి కాగానే ఎలుగు గ్రామ వీధుల్లోకి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలుగు వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు.


ఎలుగుబంటి సంచారంపై సురారం గ్రామస్తులు ఇప్పటికే అటవీశాఖ (ఫారెస్ట్) అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Updated Date - Jun 11 , 2026 | 10:48 AM