మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 10:35 AM
గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,130 రూపాయలు.. 22 క్యారెట్లపై 1,950 రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలతో పాటు డాలర్ విలువ, యూఎస్ బాండ్ల రేట్లు పెరగడంతో విలువైన లోహాలకు డిమాండ్ తగ్గింది. బంగారం ధరలు ఊహించని విధంగా పతనం అవుతున్నాయి. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 4300 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లపై 3,950 రూపాయలు తగ్గింది. గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,130 రూపాయలు.. 22 క్యారెట్లపై 1,950 రూపాయలు తగ్గింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,45,640 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,33,500 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,09,230 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక, ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా కొనసాగుతున్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి
ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..