Share News

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ABN , Publish Date - Jun 11 , 2026 | 09:38 AM

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు.

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
Trump Iran News

వాషింగ్టన్, జూన్ 11: టెహ్రాన్‌‌ను లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ భీకర దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై విరుచుకుపడుతోంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాలలోని అమెరికాకు చెందిన 18 కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ దాడులు నిర్వహిస్తున్నాయి. హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హెచ్చరికలు పక్కనపెట్టి హోర్ముజ్‌ దాటితే దాడులు తప్పవని హెచ్చరించింది.


ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే, ట్రంప్ కామెంట్లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

ఓయూలో మూల్యాంకనం ఓ మాయ!

అదృష్టమంటే ఈమెదే.. భారీ ఈదురుగాలుల సమయంలో ఏమైందో చూడండి..

Updated Date - Jun 11 , 2026 | 09:46 AM