తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:02 PM
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డు.. విద్యార్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TGBIE) ఇంటర్ మొదటి, రెండో సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
మే 13 నుంచి 21 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలలో 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసిన బోర్డు.. సకాలంలో ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు tgbie.cgg.gov.in, results.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్క్స్ మెమోను సులువుగా చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సిన ప్రొసీజర్:
ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in, results.cgg.gov.in ఓపెన్ చేయాలి.
IPE/IPASE Mark's Memos Results లింక్ మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత IPASE - 2026 RESULTS మీద క్లిక్ చేయాలి.
ఓ విండో ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థి ఇంటర్మీడియట్ గ్రూప్ ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
సంబంధిత వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం మార్క్స్ మెమోనూ ప్రింటౌట్ తీసుకుంటే సరి.
ఇవీ చదవండి:
కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత
ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!