ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!
ABN , Publish Date - Jun 11 , 2026 | 10:49 AM
ఢిల్లీలో మరోసారి కాల్పులు చెలరేగాయి. ఓ ప్రముఖ గాయకునికి చెందిన జిమ్ సెంటర్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వివరాల్లోకెళితే..
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు గురు రంధావాకు చెందిన జిమ్ సెంటర్ వద్ద దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ముఖాలకు మాస్కులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే.. కాల్పులకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినట్టు ఓ పోస్ట్, ఆడియో క్లిప్ విడుదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఆడియో క్లిప్‌లో నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగానే గురు రంధావాను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ రంధావాను హెచ్చరించినా ఆయన పెడచెవిన పెట్టారని, ఇది ట్రైలర్ మాత్రమేనని అందులో పేర్కొన్నట్లు సమాచారం. తమ ప్రత్యర్థులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమంటూ హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ పోస్టులు బిష్ణోయ్ గ్యాంగ్‌వేనని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? ఘటన వెనుక అసలు ఉద్దేశమేంటి? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా.. 1998లో జరిగిన కృష్ణజింక వేట కేసు తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. గతేడాది ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం బయట కూడా కాల్పుల ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు
తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా