మతం మారినా సామాజిక వివక్ష పోవడం లేదు
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:51 AM
మతం మారినంత మాత్రాన సమాజంలో దళితులపై ఉన్న వివక్ష తొలగడం లేదని, అందుకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ....
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఎంపీ కావ్య
న్యూఢిల్లీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మతం మారినంత మాత్రాన సమాజంలో దళితులపై ఉన్న వివక్ష తొలగడం లేదని, అందుకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ, డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కాకా కాలేల్కర్ కమిషన్ (1955), జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫారసు చేశాయని గుర్తుచేశారు. తెలంగాణలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.