Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 17 , 2026 | 07:53 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 17, 2026 10:07 IST

    హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజాపాలన దినోత్సవం

    • జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్, మండలి చైర్మన్

    • గాంధీ, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులు

    • హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

  • Sep 17, 2026 09:38 IST

    ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

    • మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: మంత్రి లోకేశ్

    • దేశ సేవలో మోదీ మరెన్నో ఏళ్లు కొనసాగాలి: లోకేశ్

  • Sep 17, 2026 09:38 IST

    ఆరుగురు విద్యార్థుల మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

    • బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం

    • ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించిన సీఎం రేవంత్

  • Sep 17, 2026 09:37 IST

    సంగారెడ్డి: చెరువులో పడి ఆరుగురు విద్యార్థుల మృతి

    • నరసింహరాజు, ఉదయ్, సుమంత్ మృతదేహాలు అప్పగింత

    • సిద్ధార్థ, గణేష్, శ్యామ్ బంధువుల ఆందోళన

    • మృతదేహాలు తీసుకోవడానికి బంధువుల నిరాకరణ

    • శిరీష చారిటబుల్ ట్రస్ట్ యజమాని రావాలని డిమాండ్

    • ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగిన బాధిత కుటుంబాలు

  • Sep 17, 2026 09:34 IST

    ఆరుగురు విద్యార్థుల మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

    • బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం

    • ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించిన సీఎం రేవంత్

  • Sep 17, 2026 09:34 IST

    సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

    • వీరజవాన్లకు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

    • కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం

    • హాజరైన గవర్నర్ శివప్రతాప్‌శుక్లా, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు

  • Sep 17, 2026 09:33 IST

    ఏలూరుకు మంత్రి నారా లోకేశ్

    • ఆళ్లనాని పార్థివదేహానికి నివాళులర్పించిన లోకేశ్

    • పార్టీపరంగా అండగా ఉంటామని మంత్రి లోకేశ్ హామీ

  • Sep 17, 2026 08:22 IST

    ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

    • 25 ఏళ్ల ప్రజా సేవకు మోదీ ప్రస్థానం నిదర్శనం: పవన్

    • మోదీ నాయకత్వంలో భారత్ అన్నిరంగాల్లో ముందడుగు: పవన్

    • ఏపీ అభివృద్ధికి మోదీ సహకారం కీలకం: పవన్

  • Sep 17, 2026 08:21 IST

    ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

    • ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తూ దేశాభివృద్ధికి సరికొత్త వేగం అందించారు

    • 'సేవ, సంకల్పం, సుపరిపాలన' అనే మోదీ విజన్ నిరంతరం స్ఫూర్తినిస్తుంది: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

  • Sep 17, 2026 08:20 IST

    ఏలూరులో ఉ.10 గంటలకు ఆళ్ల నాని అంత్యక్రియలు

    • అధికార లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు

    • ఆళ్లనాని పార్దివదేహానికి నివాళులర్పించనున్న మంత్రి లోకేష్‌

    • అంత్యక్రియలకు హాజరుకానున్న మంత్రి నిమ్మల

  • Sep 17, 2026 08:20 IST

    హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లిలో రోడ్డుప్రమాదం

    • స్కూటీని ఢీకొట్టిన టిప్పర్, తండ్రి, కుమార్తె మృతి

    • మృతులు ఇస్మాయిల్ ఖాన్(44), షఫీరా(24)

    • టిప్పర్ సీజ్, డ్రైవర్‌పై కేసు నమోదు

  • Sep 17, 2026 08:20 IST

    మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు

    • రూ.5లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు

  • Sep 17, 2026 08:10 IST

    సూడాన్‌లో ఘోర ప్రమాదం

    • బంగారు గని కూలిన ఘటనలో 70కి చేరిన మృతులు

    • గనిలో చిక్కుకున్న పలువురు కార్మికులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

  • Sep 17, 2026 08:01 IST

    నేడు ఆఫ్గానిస్థాన్ - భారత్ మధ్య మూడో టీ20

    • ఢిల్లీలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్

    • ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్ 2-0తో భారత్ కైవసం

  • Sep 17, 2026 08:00 IST

    ఢిల్లీ: నేడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

    • మోదీ ప్రజాసేవ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

  • Sep 17, 2026 07:58 IST

    ఢిల్లీ: యశోభూమిలో సెమికాన్ ఇండియా సదస్సు

    • సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • మూడు రోజుల పాటు జరగనున్న సదస్సు

    • సదస్సులో పాల్గొననున్న 52 దేశాల ప్రతినిధులు

  • Sep 17, 2026 07:57 IST

    హైదరాబాద్: నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమం

    • ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్‌లో రా.7గంటలకు ఆశీర్వాద దీపం కార్యక్రమం

    • పాల్గొననున్న కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్, కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ రాంచందర్‌, బీజేపీ నేతలు

  • Sep 17, 2026 07:56 IST

    హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం

    • తెలంగాణ భవన్‌లో జెండా ఎగరవేయనున్న కేటీఆర్

  • Sep 17, 2026 07:55 IST

    కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం

    • సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో కార్యక్రమం

    • హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు

  • Sep 17, 2026 07:55 IST

    నేడు తెలంగాణలో ప్రజా పాలన దినోత్సవం

    • పబ్లిక్ గార్డెన్స్‌లో జెండా ఎగరవేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • జిల్లాల్లో జెండా ఎగరవేయనున్న మంత్రులు

  • Sep 17, 2026 07:54 IST

    తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

    • ఉదయం సింహ వాహన సేవ

    • రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మలయప్పస్వామి దర్శనం

    • ఈనెల 23 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు

  • Sep 17, 2026 07:54 IST

    సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

    • రష్యా ఇంధన, రక్షణ రంగాలపై మరిన్ని ఆంక్షలు

    • ఇరాన్‌పై అదనపు ఆంక్షలకు బిల్లులో నిబంధనలు

    • ట్రంప్‌నకు సుంకాల అధికారాలపై డెమొక్రాట్ల అభ్యంతరం

    • భారత్‌కు వాణిజ్య, ఇంధన రంగాల్లొ కొత్త అనిశ్చితి

  • Sep 17, 2026 07:53 IST

    అమెరికా హౌస్‌లో రష్యాపై ఆంక్షల బిల్లుకు ఆమోదం

    • హౌస్‌లో 262-159 ఓట్లతో బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

    • సెనేట్‌లో ఇప్పటికే 86-11 ఓట్లతో ఆమోదం

    • ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారే అవకాశం

    • రష్యా చమురు కొనుగోలు దేశాలపై 100శాతం వరకు టారిఫ్ అధికారం