స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ.. ఒడిదుడుకుల్లో సెన్సెక్స్
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:57 PM
ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి అంతిమంగా మిశ్రమంగా ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 17: ఇవాళ (గురువారం) భారతీయ స్టాక్ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి అంతిమంగా మిశ్రమంగా ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యాయి.
నిఫ్టీ 53.00 (0.23శాతం) పాయింట్లు పెరిగి 23,270.60 దగ్గర ముగియగా, సెన్సెక్స్ 21.86 (0.029శాతం) కోల్పోయి 74,314.59 దగ్గర స్థిరపడింది.
ఈ ఉదయం 10:55 గంటల సమయంలో నిఫ్టీ 23,363.55 వద్ద నాటి గరిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్ కూడా 74,677.56 వద్ద గరిష్ఠానికి చేరింది. మార్కెట్‌లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఒంటిగంట సమయంలో ఇండెక్స్‌లు క్రమంగా లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్ 74,163.95 వద్ద నాటి కనిష్ఠ స్థాయికి పడిపోగా, నిఫ్టీ 23,193.65 కనిష్ఠాన్ని తాకింది.
సెషన్ ముగిసే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి హెవీవెయిట్ షేర్ల మద్దతుతో నిఫ్టీ లాభాల్లోకి వచ్చి ముగియగా, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది.
రంగాల వారీ ట్రేడింగ్
హెల్త్‌కేర్, ఆటో, లైఫ్ ఇన్సూరెన్స్, ఫార్మా రంగాలు సానుకూలంగా రాణించగా.. ఓఎన్‌జీసీ, టైటాన్, ఐటీ రంగానికి చెందిన హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి షేర్లలో విక్రయాల ఒత్తిడి కనిపించింది.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News