తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు షురూ
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:33 PM
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. 2027 మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. 2027 మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంతోపాటు, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది.
నవంబర్ 6 వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన పాత ఓటర్లు కూడా ఈసారి కొత్తగా ఫారం-18 దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన పట్టభద్రులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO Telangana) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్
22A పాపం కాంగ్రెస్‌ది కాదు.. బీఆర్‌ఎస్ భూ దోపిడీపై విచారణ: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News