ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలంటూ మాట్లాడుతారా.. వైసీపీపై అనిత ఫైర్
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:58 PM
డీఎస్సీపై వైసీపీ చేస్తోన్న రాద్ధాంతంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం, సెప్టెంబర్ 17: డీఎస్సీపై వైసీపీ చేస్తోన్న రాద్ధాంతంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ జరిగి ఏడాది అవుతోందని.. ఇప్పుడు బయటకు వచ్చి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకులు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడి వెళ్లడం అలవాటైందని విమర్శించారు. అసలు వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారికి కూడా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పని తీరును గమనించి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలే తీర్పు ఇస్తారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
చెప్పిన అబద్ధాన్నే 100 సార్లు చెప్పడం జగన్ నైజం: రాజేశ్
ఏపీపీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని దారి మళ్లించడానికే డీఎస్సీపై నిందలు వేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ సవాల్‌కు గొడ్డలి పార్టీ ఎందుకు స్పందించలేదని అడిగారు. డీఎస్సీపై.. చెప్పిన అబద్ధాన్నే 100 సార్లు చెప్పడం జగన్ నైజమని వ్యాఖ్యానించారు. డీఎస్సీపై జగన్ రోజుకో అబద్ధం చెబుతున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేని అసమర్థ సీఎం జగన్ అంటూ విరుచుకుపడ్డారు. డీఎస్సీపై వైసీపీ నాయకులు వేసిన 320 కేసులను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఏపీపీఎస్సీని జగన్ అవహేళన చేశారని విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక చేయాల్సిన అభ్యర్థులను జగన్ ఎంపిక చేశారన్నారు. స్పోర్ట్స్ కోటాలో అత్యధికంగా బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. బలహీన వర్గాలను అవమానించేలా స్పోర్ట్స్ కోటా గురించి జగన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డీఎస్సీలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువతను జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. గత ఐదేళ్లు జాబ్‌లెస్ క్యాలెండర్‌తో యువతను జగన్ మభ్యపెట్టారంటూ రాజేశ్ విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News