కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:10 PM
వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారణాసిలో శ్రీకాశీ విశ్వనాథ్ స్వామిని సీఎం దర్శించుకున్నారు.
వారణాసి, సెప్టెంబర్ 17: వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారణాసిలో శ్రీకాశీ విశ్వనాథ్ స్వామిని సీఎం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారన్నారు. మోదీని చూసి దేశం గర్వపడుతోందని చెప్పుకొచ్చారు. ప్రధాని పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు యూపీ ప్రభుత్వ ప్రతినిధుల ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సేవాయాత్ర సందర్భంగా పలువురు ప్రముఖులతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News