22A పాపం కాంగ్రెస్‌ది కాదు.. బీఆర్‌ఎస్ భూ దోపిడీపై విచారణ: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:58 PM
22A పాపం కాంగ్రెస్ పార్టీది కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ దోపిడి చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, పదవుల నియామకాలపై చర్చించారు. అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. 22A పాపం కాంగ్రెస్ పార్టీది కాదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ దోపిడి చేసిందని ఆరోపించారు. ఉద్యమాలు చేసిన వారు సర్వం కోల్పోతే.. కేసీఆర్ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని విమర్శించారు. భూ దోపిడిపై విచారణ జరుగుతుందని తెలిపారు. జ్యుడీషియల్ విచారణ జరగాలా? లేదా? అనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారన్నారు. గత ప్రభుత్వ భూ దోపిడీపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి పనుల వివరాలను అధిష్ఠానానికి వివరించనున్నట్లు చెప్పారు.
‘నా పదవికి మరో ఏడాది సమయముంది. మంత్రివర్గ విస్తరణ జరపాలా? లేదా? అన్నది సీఎం నిర్ణయం. రెండేళ్లలో సంస్థాగతంగా నేను సాధించిన విజయాలను అధిష్ఠానం పెద్దలకు చెప్పేందుకే ఢిల్లీకి వచ్చా. గాంధీభవన్ నుంచి పార్టీ నిర్మాణం వరకు సంస్థాగతంగా బలోపేతం చేశాం. పెండింగ్‌లో డీసీసీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియామకాలపై చర్చిస్తాం. వీలైనంత త్వరలో డీసీసీ అధ్యక్షులను నియమిస్తాం. వివిధ కార్పొరేషన్ల పదవుల భర్తీపై చర్చిస్తాం’ అని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
వాళ్లకు భయపడి చరిత్రను దాచిపెట్టారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్
Read Latest Telangana News And Telugu News