Share News

స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:08 PM

సంగారెడ్డి జిల్లాలో 15 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్(ZPHS)లో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత
Sangareddy food poisoning

సంగారెడ్డి, సెప్టెంబర్ 17: జిల్లాలో 15 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్(ZPHS)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు(గురువారం)మధ్యాహ్నం వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విద్యార్థుల కోసం బిర్యానీ తెచ్చారు. అంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపాల్ కూడా బిర్యానీ తిన్నారు. కాసేపటికే విద్యార్థులు, వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


అయితే వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్కూల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సదాశివపేట ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

22A పాపం కాంగ్రెస్‌ది కాదు.. బీఆర్‌ఎస్‌ భూ దోపిడీపై విచారణ: మహేశ్‌ గౌడ్‌

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 05:22 PM