ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:56 PM
రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లావాసులు అప్రమత్తంగా వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
అంతేకాకుండా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా సిబ్బందిని సంస్థ ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News