-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap and Telangana National and International Breaking Live Updates of 26th April 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 26 , 2026 | 06:25 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 26, 2026 07:44 IST
హైదరాబాద్: ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ
గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ
సత్వా నాలెడ్జ్ పార్క్ నుంచి ప్రారంభమైన 10కె రన్
5కె రన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
-
Apr 26, 2026 07:42 IST
హైదరాబాద్: 24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల హడావుడి
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు ఎన్నికల నిర్వహణ
ఉ.10 గంటల నుంచి మ.2 గంటల వరకు పోలింగ్
మధ్యాహ్నం 3:00 గంటలకు ఫలితాలు
-
Apr 26, 2026 07:29 IST
భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు
నేడు కళావాహన, ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం
ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తులకు అభిషేకం
-
Apr 26, 2026 07:22 IST
విశాఖ: నేడు ఏయూ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా జరుగుతున్న శతవసంతాల వేడుకలు
పాల్గొననున్న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శశిధర్
రేపు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం
-
Apr 26, 2026 07:21 IST
రంగారెడ్డి: అత్తాపూర్ పీఎస్ పరిధిలో బాలిక ఆత్మహత్యాయత్నం
తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
-
Apr 26, 2026 07:15 IST
కాల్పుల ఘటనపై ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్
షూటర్‌ను అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్
CIA ఏజెంట్స్, పోలీస్ విభాగం అద్భుతంగా పనిచేసింది: ట్రంప్
ఏజెంట్లు చాలా వేగంగా, ధైర్యంగా పనిచేశారు: ట్రంప్
-
Apr 26, 2026 07:01 IST
సంగారెడ్డి: సదాశివపేట మం. నందికంది వద్ద రోడ్డు ప్రమాదం
డివైడర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మహిళల మృతి
మరో ముగ్గురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం
మృతులు లావణ్య(39), రుక్మిణి(42)గా గుర్తింపు
-
Apr 26, 2026 06:55 IST
అమెరికా: వైట్‌హౌస్ దగ్గర కాల్పుల కలకలం
కరస్పాండెంట్స్ డిన్నర్‌హాల్‌లో కాల్పులు
ట్రంప్ సహా కీలక నేతలు సురక్షితం
-
Apr 26, 2026 06:48 IST
కర్నూలు: తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల ఆధునీకరణ పనులు పూర్తి
2 నెలల వ్యవధిలోనే 33 గేట్లు బిగించి పనులు పూర్తిచేసిన ఇంజినీర్లు
-
Apr 26, 2026 06:44 IST
జోగులాంబ గద్వాల జిల్లా: ఎన్‌హెచ్ 44పై రోడ్డు ప్రమాదం
ఇటిక్యాల సమీపంలో జాతీయ రహదారి 44పై లారీని ఢీకొన్న..
CMR ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్
తప్పిన పెను ప్రమాదం.. నలుగురికి స్వల్ప గాయాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన ప్రమాదం
-
Apr 26, 2026 06:38 IST
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా
ఏప్రిల్ 29న మధ్యాహ్నం 3:00కు జరగాల్సిన సమావేశం
ఏప్రిల్ 30న ఉదయం 10:30కు మార్పు
ఏప్రిల్ 29 ఉదయం 11:00 గంటల లోపు..
మంత్రిమండలి కోసం ప్రతిపాదనలు పంపాలని సూచన
-
Apr 26, 2026 06:31 IST
నేడు ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్
133వ ఎడిషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ మన్‌కీ బాత్