Share News

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ చెకింగ్ డ్రైవ్.. ప్రయాణికులు ఈ పత్రాలను వెంట ఉంచుకోవాల్సిందే!

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:10 PM

అక్టోబర్ 1 నుంచి 31 మధ్యలో రైలు ప్రయాణం ఏమన్నా ప్లాన్ చేశారా..? అయితే ఈ కింది పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిందే!

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ చెకింగ్ డ్రైవ్.. ప్రయాణికులు ఈ పత్రాలను వెంట ఉంచుకోవాల్సిందే!
Railway ticket checking

ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్‌ను నిర్వహించడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. అయితే ఈ డ్రైవ్ టికెట్ లేకుండా ప్రయాణించే వారికి మాత్రమే పరిమితం కాలేదు. వివిధ రిజర్వేషన్ కోటాలను ఉపయోగించుకుని ప్రత్యేక రాయితీలు పొందిన ప్రయాణికులను కూడా తనిఖీ చేయాలని రైల్వే భావిస్తుంది. నిజంగా ఈ ప్రయాణికులు రాయితీలకు అర్హులేనా.. కాదా అన్నది పరిశీలించబోతోంది. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఈ తనిఖీలు అదే నెల 31 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కొన్ని పత్రాలను తమతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అవి ఎంటంటే..?


తనిఖీ సమయంలో ఇవి కావాలి..

ప్రత్యేక రాయితీ పొంది ప్రయాణించే వారు కచ్చితంగా ఈ కింది పత్రాలు తమ వద్దే ఉంచుకోవాలి. తనిఖీ సమయంలో అర్హతను నిరూపించుకోవడానికి ఇవి అవసరం.

  • ఆధార్ కార్డ్

  • పాస్‌పోర్ట్

  • పాన్ కార్డ్

  • డ్రైవింగ్ లైసెన్స్

  • ఓటర్ ఐడీ

  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముద్రించిన ఫొటో ఐడీ కార్డ్

  • గుర్తింపు పొందిన విద్యాసంస్థ ఇచ్చిన స్టూడెంట్ ఐడీ

  • ఫొటోతో కూడిన జాతీయ బ్యాంకు పాస్‌బుక్

పైన పేర్కొన్న వాటిలో ఒకదాన్ని ప్రయాణ సమయంలో మీ చెంత ఉంచుకోవాలి. అలాగే జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకువెళ్లాలి.


కుటుంబంలో ఒకరి దగ్గర పత్రాలు ఉంటే చాలు

కాగా కుటుంబం మొత్తానికి కలిపి ఒక టికెట్ బుక్ చేసుకున్న సందర్భంలో అందరూ డాక్యుమెంట్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని ఒక సభ్యుడి దగ్గర ఇవి ఉంటే చాలు. అలాగే ఎక్కువ మంది ప్రయాణికులు కలిపి ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా.. వారిలో ఒకరి దగ్గర ఉంటే సరిపోతుంది. ఒకవేళ బృందంలో ఒకరి వద్ద కూడా అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోతే.. వారందరినీ టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారు. అందుకే ఈ పత్రాలను ప్రయాణంలో జాగ్రత్తగా ఉంచుకోవాలి.


ఈ వార్తలూ చదవండి

ప్రయాణంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు!

సముద్రం కింద 320 కి.మీ. వేగంతో బుల్లెట్ ట్రైన్.. దీని వేగానికి సలాం కొట్టాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:29 PM