సముద్రం కింద 320 కి.మీ. వేగంతో బుల్లెట్ ట్రైన్.. దీని వేగానికి సలాం కొట్టాల్సిందే..
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:46 PM
జపాన్ బుల్లెట్ ట్రైన్లు అంటే వేగం, సాంకేతికత, కచ్చితత్వానికి పెట్టింది పేరు. అయితే హయాబుసా షింకాన్సెన్‌లో ప్రయాణం మాత్రం సాధారణ బుల్లెట్ రైలు ప్రయాణానికి పూర్తి భిన్నమైనది. సముద్రం అడుగున నిర్మించిన భారీ టన్నెల్ గుండా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా హయాబుసా నిలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ బుల్లెట్ ట్రైన్లు అంటే వేగం, సాంకేతికత, కచ్చితత్వానికి పెట్టింది పేరు. అయితే హయాబుసా షింకాన్సెన్‌లో ప్రయాణం మాత్రం సాధారణ బుల్లెట్ రైలు ప్రయాణానికి పూర్తి భిన్నమైనది. సముద్రం అడుగున నిర్మించిన భారీ టన్నెల్ గుండా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా హయాబుసా నిలుస్తోంది. E-5 సిరీస్‌కు చెందిన ఈ బుల్లెట్ ట్రైన్.. హోన్షూ ద్వీపంలోని టోక్యో నుంచి హొక్కైడో వరకు ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన అండర్‌సీ రైల్వే టన్నెళ్లలో ఒకటైన సీకాన్ ద్వారా ఇది ప్రయాణించడం అత్యంత అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
ఇటీవల ఓ భారతీయ కంటెంట్ క్రియేటర్ హయాబుసా బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. టోక్యో నుంచి హొక్కైడోకు వెళ్తున్న సమయంలో హయాబుసా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అతను చెప్పాడు. ఈ ప్రయాణంలో సముద్రం కింద ఉన్న సీకాన్ టన్నెల్‌ను దాటాల్సి ఉంటుందని వివరించాడు. సుమారు 800 అడుగుల లోతులో సముద్రం కింద నిర్మించిన ఈ టన్నెల్‌లో రైలు దూసుకెళ్లడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. సుమారు 54 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించడం జపాన్ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. టోక్యో నుంచి హొక్కైడో వరకు సుమారు 900 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం నాలుగు గంటల్లోనే కవర్ చేస్తుందని వివరించాడు. అలాగే, హయాబుసా ట్రైన్‌లో కేవలం వేగానికే కాకుండా ప్రయాణికుల సౌకర్యానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపాడు.
సీకాన్ టన్నెల్ మొత్తం పొడవు 53.85 కిలోమీటర్లు. అందులో సుమారు 23.3 కిలోమీటర్ల మార్గం సముద్రం కింద ఉంటుంది. ఈ టన్నెల్ జపాన్‌లోని ఆమోరి ప్రాంతాన్ని హొక్కైడోతో అనుసంధానిస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, భూకంపాల వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ నిర్మాణాన్ని రూపొందించారు. 1988లో ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. సముద్రం కింద ఇంత భారీ దూరాన్ని రైల్వే మార్గంగా నిర్మించడం అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ప్రపంచ ఇంజినీరింగ్‌లో విశేష ఘట్టంగా పరిగణించబడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
భార్య కోసం రెండేళ్లు శ్రమించి పూలతోట పెంచిన భర్త
పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...