Share News

భార్య కోసం రెండేళ్లు శ్రమించి పూలతోట పెంచిన భర్త

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:31 PM

భార్య మూరెడు మల్లెపూలు అడిగితేనే లైట్‌ తీసుకునే భర్తలు ఎంతోమంది ఉంటారు. అయితే భార్య డిప్రెషన్‌లోకి వెళుతుందని... ఆమెకు నచ్చిన పూలతోటను రెండేళ్ల పాటు కష్టపడి పెంచాడో ఆదర్శ భర్త.

భార్య కోసం రెండేళ్లు శ్రమించి పూలతోట పెంచిన భర్త
Lifestyle

భార్య మూరెడు మల్లెపూలు అడిగితేనే లైట్‌ తీసుకునే భర్తలు ఎంతోమంది ఉంటారు. అయితే భార్య డిప్రెషన్‌లోకి వెళుతుందని... ఆమెకు నచ్చిన పూలతోటను రెండేళ్ల పాటు కష్టపడి పెంచాడో ఆదర్శ భర్త. పైగా ఆమె వాటిని చూడలేని స్థితిలో ఉందని తెలిసి కూడా... ఆమెను బాధలోంచి బయటకు తీసుకొచ్చాడు. భార్య మీద తనకున్న అమితమైన ప్రేమను నిరూపించాడు.

జపాన్‌లోని తోషియుకి కురోకి, ఆయన భార్య యసుకో కలిసి డెయిరీఫామ్‌ నడిపేవాళ్లు. యసుకో తన 52 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా చూపు కోల్పోయింది. దీంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేసింది. ఆమె చింతను పోగొట్టి, బయటకు ఎలాగైనా తీసుకు రావాలను కున్నాడు కురోకి. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో సువాసలను వెదజల్లే గులాబీ రంగు పూలతోటను పెంచారాయన.


యసుకో ఆ పువ్వులను చూడలేక పోయినప్పటికీ.. వాటి వాసన ఆమెను బయట అడు గుపెట్టేలా చేసింది. ఇంటి చుట్టూ ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి, వారితో ముచ్చటించడానికి కూడా చాలామంది రావడంతో యసుకో బెంగ తీరింది. అలా కురోకి తన భార్య బాధను పోగొట్ట డంలో విజయం సాధించాడు. ఇది పైపైన కనిపించే అందం కోసం కాదు... ఆమెకు శాంతి, అద్భుతమైన క్షణాలు అందించడం కోసం. భార్య కోసం వృద్ధ కురోకి పడిన శ్రమకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?

పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 02:40 PM