Share News

దక్షిణాఫ్రికా పబ్‌లో షూటింగ్.. 17 మంది మృతి

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:17 PM

దక్షిణాఫ్రికాలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. జొహాన్నెస్ బర్గ్ సమీపంలోని ఓ పబ్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 17 మంది మరణించారు.

దక్షిణాఫ్రికా పబ్‌లో షూటింగ్.. 17 మంది మృతి
South Africa shooting

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. జొహాన్నెస్ బర్గ్ సమీపంలోని ఓ పబ్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 17 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. శనివారం వెస్ట్‌రాండ్ జిల్లాలో సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పిస్టల్స్, ఏకే-47లతో వచ్చిన నిందితులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు.


పబ్‌ బయట, లోపల కస్టమర్లు మద్యం సేవిస్తున్న సమయంలో నిందితులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. మొదట బయటఉన్న వారిపై కాల్పులు జరిపి ఆపై లోపలకు వెళ్లి మారణహోమం సృష్టించారు. కొందరి వద్ద నుంచి సెల్‌ఫోన్స్ తీసుకుని రెండు వాహనాల్లో పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరూ పట్టుబడలేదని సమాచారం. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. గతవారం కూడా డర్బన్ నగరంలో ఇలాంటి కలకలం రేగింది. ఓ వ్యక్తి కాల్పులకు దిగడంతో గర్భిణి సహా 11 మంది మరణించారు. జూన్‌లో ఓ సబర్బన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఏకంగా 12 మంది మరణించారు.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీ వల్లే భారత్‌కు ఇంధన భద్రత: ఆస్ట్రేలియా ప్రధాని

డీల్‌ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన

Updated Date - Sep 27 , 2026 | 01:32 PM