Share News

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే?

ABN , Publish Date - Jul 26 , 2026 | 09:30 PM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే?
Donald Trump Iran

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితిలో యూఎస్ రాయబారి మైక్ వాల్ట్ 'ఫాక్స్ న్యూస్'కు వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు మరిన్ని అవకాశాలు కల్పించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ట్ పేర్కొన్నారు.


గత 13 రోజులుగా అమెరికా దళాలు ఇరాన్‌పై విరుచుకుపడుతూ తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, వారాంతంలో ఈ దాడులకు పెంటగాన్ తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇరాన్ వైపు నుంచి కూడా పొరుగు దేశాలపై ఎలాంటి దాడులు జరిగినట్లు నివేదికలు రాలేదు. ఈ పరిణామాలపై మైక్ వాల్ట్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం చర్చలకు కాస్త సమయం ఇస్తున్నారని, వాటికి తగిన వాతావరణం కల్పిస్తున్నారని తెలిపారు. అయితే, ఈ చర్చల స్వరూపం గురించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించలేదు.


మరోవైపు, ఈ విరామంపై వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి శనివారం స్పందిస్తూ.. దౌత్యానికే తన తొలి ప్రాధాన్యతని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ స్పష్టంగా చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఒకవేళ ఇరాన్ కనుక చర్చలకప రాకపోతే, పరిణామాలు ఎలా ఉంటాయో ట్రంప్ ఇప్పటికే ఆ దేశానికి రుచి చూపించారని హెచ్చరించారు. అమెరికా తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఏ రూపం దాల్చుతాయనే అంశంపై అంతర్జాతీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

మద్యం మత్తులో కన్నబిడ్డల ముందే భార్యను నరికి చంపిన భర్త

Updated Date - Jul 26 , 2026 | 09:37 PM