Share News

రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:57 PM

వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు కొన్ని అలవాట్లు మానసిక ప్రశాంతత, నిద్రపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు.

రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి
Vastu Tips Before Sleep

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని కొన్ని అలవాట్లు మన మానసిక ప్రశాంతత, నిద్ర, ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాలను నివారించాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు.


సింక్‌లో మురికి పాత్రలు వదిలేయడం

చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలు కడగకుండా సింక్‌లోనే ఉంచేస్తారు. వాస్తు ప్రకారం.. ఇలా చేయడం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుందని, మానసిక ప్రశాంతత తగ్గి నిద్రకు అంతరాయం కలగవచ్చని చెబుతారు. అలాగే ఇంటి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్మకం. అందుకే పడుకునే ముందు పాత్రలు శుభ్రం చేయడం మంచిదని సూచిస్తారు.


పడుకునే ముందు అద్దం చూడటం

చాలా మంది ఇళ్లలో పడకగదిలో అద్దం ఉంటుంది. వాస్తు ప్రకారం.. రాత్రి నిద్రపోయే ముందు అద్దంలో ఎక్కువసేపు చూసుకోవడం మంచిది కాదని చెబుతారు. అద్దం సానుకూల, ప్రతికూల శక్తులను ప్రతిబింబిస్తుందని, దీంతో కొందరిలో భయం, ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఉందని వాస్తు నమ్మకం.


Note: ఇందులోని సమాచారం వాస్తు శాస్త్రానికి సంబంధించిన విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మొక్కలాంటి నత్త!

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

Updated Date - Jul 26 , 2026 | 08:58 PM