మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:33 PM
దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులకు నందన్ నిలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అందులో ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పరీక్షల విధానాన్ని ఎలా మెరుగుపరచాలనే అంశంపై ఈ టాస్క్‌ఫోర్స్ సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలు పూర్తిగా విశ్వసనీయంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాం. అలాగే ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకురాబోతున్నాం. ఈ కొత్త చట్టాన్ని సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం’ అని మోదీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు