Share News

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:14 PM

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రిషికంఠ సింగ్ రజత పతకం సాధించాడు.

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం
Rishikanth Singh

ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రిషికంఠ సింగ్ రజత పతకం సాధించాడు. కాగా మలేసియాకు చెందిన అనిక్ బిన్ కాస్డాన్ 273 కేజీలు ఎత్తి స్వర్ణం గెలుపొందగా.. కెన్యా వెయిట్ లిఫ్టర్ జోషువా అముంగా 260 కేజీలు ఎత్తి కాంస్యం నెగ్గాడు.


తొలుత స్నాచ్ విభాగంలో రిషికంఠ 121 కేజీలు ఎత్తి కామన్వెల్త్ క్రీడల రికార్డును సమం చేశాడు. మలేసియాకు చెందిన అనిక్ కూడా 121 కేజీలు ఎత్తడంతో ఇద్దరూ గేమ్స్ రికార్డును నమోదు చేశారు. అయితే క్లీన్ అండ్ జర్క్‌ విభాగంలో అనిక్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 152 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఈ విభాగంలో రిషికంఠ 143 కేజీలు మాత్రమే ఎత్తగలిగాడు. మొత్తంగా అనిక్ 273 కేజీలు (121+152) ఎత్తి తొలి స్థానంలో నిలవగా, రిషికంఠ 264 కేజీలు (121+143) ఎత్తి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కెన్యాకు చెందిన జోషువా 260 కేజీల మొత్తం లిఫ్ట్‌తో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

Updated Date - Jul 26 , 2026 | 05:15 PM