జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:15 PM
హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత జింబాబ్వే ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత జింబాబ్వే ఫీల్డింగ్ చేయనుంది. అయితే ఇప్పటికే 2-0 తేడాతో భారత జట్టు సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చివరి టీ20లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. కాగా భారత తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రిన్స్ యాదవ్ యాదవ్ స్థానంలో అశోక్ శర్మ, శివమ్ దూబె స్థానంలో సూర్యాంశ్ షెడ్గె జట్టులోకి వచ్చారు.
భారత్ తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గె, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ యాదవ్
జింబాబ్వే తుది జట్టు:
సికందర్ రజా(కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, వెస్లీ మద్వీర, మరుమాని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జ, బ్లెస్సింగ్ ముజరబాని.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్‌లో షాకింగ్ ఘటన.. పట్టుతప్పి తలకిందులుగా పడిపోయిన జిమ్నాస్ట్
ఫిఫా ఫైనల్ తర్వాత తొలిసారి కనిపించిన మెస్సి.. వీడియో వైరల్