Share News

ట్రంప్‌పై ఇరాన్‌ ఎంబసీ ట్రోల్‌.. అక్షయ్‌ కుమార్‌ 'మీమ్‌'తో పంచ్‌!

ABN , Publish Date - Sep 09 , 2026 | 07:10 PM

అమెరికా-ఇరాన్‌ మధ్య హోర్ముజ్‌ జలసంధి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలపై బాలీవుడ్‌ ఊహించని రీతిలో ట్విస్ట్‌ వచ్చింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇరాన్‌ ఎంబసీ ఓ మీమ్‌తో వ్యంగ్యంగా టార్గెట్‌ చేసింది.

ట్రంప్‌పై ఇరాన్‌ ఎంబసీ ట్రోల్‌.. అక్షయ్‌ కుమార్‌ 'మీమ్‌'తో పంచ్‌!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్‌ మధ్య హోర్ముజ్‌ జలసంధి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలపై బాలీవుడ్‌ ఊహించని రీతిలో ట్విస్ట్‌ వచ్చింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇరాన్‌ ఎంబసీ ఓ మీమ్‌తో వ్యంగ్యంగా టార్గెట్‌ చేసింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'హేయ్ బేబీ' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని మీమ్‌గా ఉపయోగించి అగ్రరాజ్య అధ్యక్షుడిపై సెటైర్‌ వేసింది. ఇరాన్‌ అధికారికంగా నిర్వహించే 'ఎక్స్‌' అకౌంట్లో ఈ మీమ్‌ను ఈ నెల 8న పోస్ట్‌ చేసింది. హోర్ముజ్‌ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఓ మానవ రహిత వాహనాన్ని ఐఆర్‌జీసీ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ పోస్ట్ వెలువడటం గమనార్హం.


ఇరాన్ తాము స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న యూఎస్ అండర్‌వాటర్‌ డ్రోన్‌ ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. ఈ చర్యను క్లిష్టమైన నిఘా ఆపరేషన్‌గా ఐఆర్‌జీసీ అభివర్ణించింది. అయితే అమెరికా మాత్రం దీనిపై భిన్నంగా స్పందించింది. అది పాత మోడల్‌కు చెందిన డ్రోన్‌ అని, కార్యకలాపాల సమయంలో అది సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఇరాన్‌‌కు చిక్కిందంది.


కాగా.. అక్షయ్‌ నటించిన 2011 నాటి 'హేయ్ బేబీ' చిత్రంలోని ఓ హావభావాన్ని ఉపయోగిస్తూ.. 'ఓ వాహనాన్ని పోగొట్టుకున్నారు. చమురు ధర 100 డాలర్లకు చేరువలో ఉంది. ఎన్నికలు వస్తున్నాయ్. ఎలా సాగుతోంది ట్రంప్‌?' అన్నట్టుగా భావించే కామెంట్‌ను జోడించింది. యూఎస్‌పై ఇరాన్‌ దౌత్య కార్యాలయం చేసిన ఈ మీమ్‌.. సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా భారతీయ నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కొందరు నెటిజన్లు ఈ మీమ్‌పై బాగా పేలిన పంచ్‌ అని కామెంట్ చేయగా, మరికొందరు అక్షయ్‌ మీమ్‌లకు ఉన్న ప్రత్యేకతను గురించి వ్యాఖ్యానించారు. అయితే.. ఈ మీమ్‌ కేవలం 'ఇరాన్‌ ఇన్‌ ఇండియా' అకౌంట్‌కే పరిమితం కావాల్సిందని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

ఎర్రకోటే లక్ష్యం.. ఏళ్ల ముందే రెక్కీ.. ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో కీలక వివరాలు

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

Updated Date - Sep 09 , 2026 | 07:10 PM