Share News

రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకోనున్న యూఎస్

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:01 AM

రష్యా నుంచి డీజిల్ దిగుమతికి అమెరికా డీల్ కుదుర్చుకుంది. త్వరలో అమెరికాకు రష్యా డీజిల్‌ను ఎగుమతి చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. రష్యాతో డీజిల్ దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.

రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకోనున్న యూఎస్

ఇంటర్‌నెట్ డెస్క్: రష్యా నుంచి డీజిల్ దిగుమతికి అమెరికా డీల్ కుదుర్చుకుంది. దీంతో త్వరలో అమెరికాకు రష్యా డీజిల్‌ను ఎగుమతి చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. రష్యాతో డీజిల్ దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. ముందుగా రష్యా నుంచి అమెరికాకు 3 లక్షల టన్నుల డీజిల్ వస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇందుకు అంగీకరించారని చెప్పారు. ‘‘అమెరికాకు 3 లక్షల టన్నుల డీజిల్‌ను వెంటనే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకారం తెలిపారు. అలాగే, రష్యాలో రిఫైనరీల పరిస్థితిని బట్టి ముందు ముందు దిగుమతి మరింత పెరుగుతుంది. ఈనెలలో 3 లక్షల టన్నులు, నవంబరులో 5 లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా మనకు సరఫరా చేస్తుంది’’ అని ట్రంప్ పోస్టు చేశారు. కాగా.. అమెరికాలో డీజిల్ ధరలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రష్యా నుంచి డీజిల్ దిగుమతి కోసం అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది.


పుతిన్‌కు ట్రంప్ గిఫ్ట్.. జెలెన్‌స్కీ ఆగ్రహం

రష్యా నుంచి డీజిల్ దిగుమతి కోసం అమెరికా చేసుకున్న ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని పుతిన్‌కు ట్రంప్ ఇచ్చిన గిఫ్ట్‌గా ఆయన అభివర్ణించారు. ‘‘యుద్ధాన్ని ముగించాల్సిన తరుణంలో రష్యాతో అమెరికా డీజిల్ ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని మరింత సాగదీస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యాపై ఆంక్షలను అమెరికా ఎత్తివేసేలా కనబడుతోంది’’ అని జెలెన్‌స్కీ అన్నారు. కాగా.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు డీజిల్, చమురును సరఫరా చేస్తామని పుతిన్ తెలిపారు. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, అమెరికాకు రష్యా సరఫరా చేసే డీజిల్ క్వాంటిటీ చాలా తక్కువ అని విశ్లేషకులు పేర్కొన్నారు. మొదటి విడతలో 2.25 మిలియన్ బారెళ్ల డీజిల్‌ను సరఫరా చేస్తుందని, అయితే అమెరికాలో రోజువారి డీజిల్ వాడకమే దాదాపు 3.8 మిలియన్ బారెళ్లు ఉందని ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ టిమ్ ఆర్మిటేజ్ తెలిపారు. అంత మొత్తం సరఫరాతో అమెరికాలో డీజిల్ ధరలు తగ్గవని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2026 | 07:14 AM