మక్కా మదీనాలో క్షిపణుల శకలాలు.. సౌదీ ప్రభుత్వం వెల్లడి
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:15 AM
సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలిపింది. ఆ క్షిపణుల శకలాలు కొన్ని ప్రాంతాల్లో పడ్డాయని సౌదీ పౌర రక్షణ విభాగం శనివారం ఎక్స్‌లో ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలిపింది. ఆ క్షిపణుల శకలాలు కొన్ని ప్రాంతాల్లో పడ్డాయని సౌదీ పౌర రక్షణ విభాగం శనివారం ఎక్స్‌లో ప్రకటించింది. మక్కా వెలుపల ఉన్న వాడీ ముఘమాస్, జెడ్డాలోని అల్ నుజా, తైఫ్‌లోని వాడీ జలీల్, రాబిగ్లోని జనసంచారం లేని ప్రదేశంలో క్షిపణుల శకలాలు పడ్డాయని వెల్లడించింది. ఆ ఘటనలో జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. మక్కా సహా పశ్చిమ సౌదీ అరేబియాలోని నాలుగు ప్రావిన్సుల్లో ప్రమాదం పొంచి ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించారు. ప్రజలు వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
కాగా.. సౌదీ అరేబియాలోని ఇతర ప్రాంతాలపై కూడా దాడులు చేశామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. తమ లక్ష్యాల్లో మూడు విమానాశ్రయాలు, రెండు చమురు కేంద్రాలు, ఒక చమురు పైప్‌లైన్, ఒక వైమానిక స్థావరం ఉన్నాయని హౌతీల సైనిక ప్రతినిధి యహ్యా సరీ ఎక్స్‌లో తెలిపారు. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దమ్మామ్, నజ్రాన్ ప్రాంతాల్లోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నామని ఆయన చెప్పారు. అలాగే ఖమీస్ ముషైత్ వైమానిక స్థావరంతో పాటు, తూర్పు నుంచి పశ్చిమానికి చమురును తరలించే పైప్‌లైన్, చమురు పంపింగ్ కేంద్రాలపై కూడా దాడులు చేశామని పేర్కొన్నారు.
యెమెన్‌లోనూ ఉద్రిక్తతలు
యెమెన్‌లోని సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. దక్షిణ యెమెన్‌లోని ఏడెన్ ఓడరేవు ప్రాంతంలో ఉన్న కోస్ట్ గార్డ్ కేంద్రాలపై హౌతీలు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని తెలిపింది. ఈ దాడులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వల్ల సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి, హౌతీ తిరుగుబాటుదారులు సరిహద్దుల వెంట దాడులు చేయకుండా చాలావరకు పరిస్థితి అదుపులో ఉంది. అయితే, తాజా దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. మరోవైపు, యెమెన్ రాజధాని సనా హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది.
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..