Share News

మక్కాలో హై అలర్ట్.. హూతీల క్షిపణులను అడ్డుకున్న సౌదీ కూటమి దళాలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:02 PM

సౌదీలోని మక్కాతో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక ముప్పుపై అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. తాయిఫ్, యన్బు నగరాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను కూటమి వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మక్కాలో హై అలర్ట్.. హూతీల క్షిపణులను అడ్డుకున్న సౌదీ కూటమి దళాలు
Saudi Arabia Missile Threat Alert

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 24: సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కాతో పాటు పలు ప్రాంతాలలో ఇవాళ (శనివారం) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'శత్రువుల వైమానిక ముప్పు' పొంచివుందంటూ సౌదీ పౌర రక్షణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ప్రమాదం తొలగిపోయిందని అధికారులు ప్రకటించారు.

అంతకుముందు, మక్కా ప్రావిన్స్‌తో పాటు జెడ్డా, యన్బు, తాయిఫ్ ప్రాంతాలలో నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా పౌరులను అప్రమత్తం చేశారు. ప్రజలు సివిల్ డిఫెన్స్ సూచనలు పాటించాలని, గుమిగూడటం లేదా వీడియోలు తీయడం పూర్తిగా మానుకోవాలని, అత్యవసరమైతే 911 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

సౌదీ నగరాలైన తాయిఫ్, యన్బు లక్ష్యంగా హూతీ ఉగ్రవాదులు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ నేతృత్వంలోని కూటమి వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్లు మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కి తెలిపారు. అంతకుముందు రియాద్ వైపు దూసుకొచ్చిన మరో బాలిస్టిక్ క్షిపణిని కూడా కూల్చివేశారు.

అటు, యెమెన్‌లోని తాయిజ్ తూర్పు సరిహద్దుల్లో సౌదీ మద్దతుగల యెమెన్ ప్రభుత్వ బలగాలకు, హూతీ తిరుగుబాటుదారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు పునఃప్రారంభమయ్యాయి.

భారతీయ తీర్థయాత్రికుల (ఉమ్రా యాత్రికులు) రాక: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయ ఉమ్రా యాత్రికుల రాకపోకల కోసం రియాద్, జెడ్డాలలో భారత రాయబార కార్యాలయాలు 24 గంటల కంట్రోల్ రూమ్‌లను నిర్వహిస్తున్నాయి. గడిచిన వారంలో సుమారు 3,000 మంది యాత్రికులు భారతదేశానికి సురక్షితంగా చేరుకోగా, మరో 10,000 మందికి పైగా యాత్రికులు స్వదేశానికి పయనమయ్యారు.(Saudi Arabia Missile Threat Alert)


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 24 , 2026 | 09:14 PM