సౌదీ రాజకుటుంబంపై హూతీల ‘ఎప్‌స్టీన్’ గన్
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:46 AM
సౌదీ అరేబియాతో యుద్ధభూమిలో ఆయుధాలతో భీకరంగా పోరాడుతున్న యెమెన్‌లోని హూతీలు.. తాజాగా ఎవరూ ఊహించని కొత్త అస్త్రాన్ని విస్తృతంగా వాడుతున్నారు.
న్యూయార్క్, అక్టోబరు 24: సౌదీ అరేబియాతో యుద్ధభూమిలో ఆయుధాలతో భీకరంగా పోరాడుతున్న యెమెన్‌లోని హూతీలు.. తాజాగా ఎవరూ ఊహించని కొత్త అస్త్రాన్ని విస్తృతంగా వాడుతున్నారు. అమెరికాకు చెందిన సెక్స్ రాకెట్ సూత్రధారి ఎప్‌స్టీన్‌తో సౌదీ రాజకుటుంబ సభ్యులకు, వారి సేవకులకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని ప్రధాన మీడియాలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా నగరంలోని కాబాపై ఉండే వస్త్రంతో తయారుచేసిన చిత్రపటాలను సౌదీలోని కొందరు ప్రముఖులు ఎన్‌స్టీన్‌కు బహూకరించారని హూతీల అధ్యక్షుడు మహదీ అల్ మషత్ ఆరోపించారు. ఆయన ఆరోపణల వీడియోను హూతీల మీడియా విభాగం సోషల్‌మీడియాలో విస్తృతంగా షేర్‌చేస్తోంది. ఈ ప్రచారం ద్వారా ఇస్లాంకు తామే అసలైన రక్షకులమని హూతీలు ప్రచారం చేసుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష