Share News

సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. రక్షించిన పాకిస్థాన్

ABN , Publish Date - May 06 , 2026 | 03:33 PM

భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల జరిగిన పరిణామలతో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి ఆంక్షలు విధించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. రక్షించిన పాకిస్థాన్
Pakistan Navy rescue

ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇరు దేశాలు బద్దశత్రువులైనప్పటికీ అవసరమైనప్పుడు పరస్పరం సాయం చేసుకుంటాయి. ఇప్పటికే అనేక సందర్భాల్లో పాకిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. తాజాగా ఇండియాకు పాకిస్థాన్ సాయం చేసింది. భారతీయులు నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకోగా స్పందించిన పాక్ సాయం చేసిందని సమాచారం. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం..


ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్ట్ నుంచి ఎంవి గౌతమ్ అనే కార్గో షిప్ మస్కట్‌కు బయలుదేరింది. ఈ నౌక అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా సాంకేతి సమస్య తలెత్తింది. దీంతో కంట్రోల్ కోల్పోయి ప్రమాదంలో చిక్కుకోవడంతో షిప్‌లోని సిబ్బంది కంగారుపడిపోయారు. వెంటనే పాకిస్థాన్ సాయం కోరగా పాజిటివ్‌గా స్పందించింది. మానవత్వాన్ని చాటుకుంటూ నౌకలో ఉన్న సిబ్బందిని కాపాడింది పాక్ నేవి. సిబ్బందికి ఆహారం, వైద్య, ఇతర అత్యవసర సహాయాన్ని అందించారు.


ప్రమాద సమయంలో ఎంవి గౌతమ్ షిప్‌లో ఆరుగురు భారతీయులు, ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారు. నౌక ఆగిపోవడంతో మొదట ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు సమాచారం అందించారు. వాళ్లే పాకిస్థాన్‌కు సహాయం కోసం సమాచారం పంపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన పిఎంఎస్ఎస్ అనే ఓ నిఘా నౌక అటువైపే పెట్రోలింగ్ చేస్తోంది. మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌ నుంచి సమాచారం అందగానే పాక్ నేవీ అధికారులు వెంటనే 'ఎంవి గౌతమ్' దగ్గరకు చేరుకుని కాపాడారు. ఇలా అంతర్జాతీయ జలాల్లో ప్రమాదాలు జరిగితే దగ్గర్లోని దేశం సహాయం అందించాలి. ఇలా అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే పాకిస్థాన్ ఈ సహాయం చేసింది.


ఇవి కూడా చదవండి..

విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..

తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా.! మరి ఆ స్థానం ఎవరికి?

Updated Date - May 06 , 2026 | 03:38 PM