విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం.. ప్రమాణ స్వీకారానికి రాహుల్
ABN , Publish Date - May 06 , 2026 | 02:58 PM
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం టీవీకే ప్రభుత్వం ఏర్పాటు మద్దతు తెలుపుతూ విజయ్‌ను మంగళవారంనాడు కలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌లో విజయ్ కలుసుకోనున్నారు.
చెన్నై: తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ విజయ్‌ను మంగళవారంనాడు ఉదయం కలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌లో విజయ్ కలుసుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ సైతం ధ్రువీకరించారు. ఈనెల 7న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి విజయ్ పార్టీ సన్నాహాలు చేస్తుండగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
వేగంగా పరిణామాలు
టీవీకేకు మద్దతు ఇవ్వాలని విజయ్ నేరుగా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని కోరినట్టు ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలియజేయడంతో పార్టీ తమిళనాడు శాసనసభాపక్షం మంగళవారం చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో టీవీకేకు మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరిశ్ చోడంకర్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను కాంగ్రెస్ నేతలు కలుసుకుని మద్దతు తెలియజేశారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు 108 సీట్లలో గెలుపు అవసరం కాగా, టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఆ బలం 113కు చేరింది. పాట్టాలి మక్కల్ కట్టి (పీఎంకే) నుంచి ఎంపికైన నలుగురు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌ను ఆయన నివాసంలో కలిసారు. కాగా, తలో రెండు స్థానాలు గెలిచిన సీపీఐ, సీపీఐ, వీసీకేతో పాటు ఒక చోట గెలిచిన ఐయూఎంల్ కూడా టీవీకేకు మద్దతిచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..
తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా.! మరి ఆ స్థానం ఎవరికి?