తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా.! మరి ఆ స్థానం ఎవరికి?
ABN , Publish Date - May 06 , 2026 | 12:31 PM
తమిళనాడులో ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన విజయ్.. ఇప్పుడు ఒకచోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారు? ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్, కోలీవుడ్‌లో గ్లామర్‌కు ప్రతీకగా నిలిచిన త్రిషా కృష్ణన్ రాజకీయ రంగప్రవేశం చేయబోతుందా? ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. టీవీకే అధినేత విజయ్ తీసుకోబోతున్న నిర్ణయాలు, జరుగుతున్న అంతర్గత చర్చలు ఈ ఊహాగానాలకు మరింత ఊపునిస్తున్నాయి.
అద్భుతమైన రాజకీయ అరంగేట్రంతో తిరుచిరాపల్లి(తిరుచ్చి) ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విజయ్.. ఇప్పుడు ఒకచోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి, పెరంబూర్ నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకోనున్నట్టు తెలుస్తోంది. ఖాళీఅయ్యే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై టీవీకేలో చర్చలు జోరందుకున్నాయి. అంతకంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద డిబేట్సే నడుస్తున్నాయి. టీవీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం బైపోల్ టికెట్ త్రిషకే అని కమిట్ అయిపోతున్నారు.
సీఎం అవుతానంటూ గతంలో త్రిష కామెంట్స్ చేయడం.. ఇప్పుడు త్రిష రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా చెబుతున్న విజయ్ పార్టీ టీవీకే గెలుపొందడం.. విజయ్ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట బైపోల్ వచ్చే అవకాశం ఉండటం.. వెరసి పరిస్థితులన్నీ త్రిష తన కలను నెరవేర్చుకునేందుకు సహకరిస్తున్నాయా? అని నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.
ప్రస్తుతానికి త్రిష తాను కలగన్నట్లుగా సీఎం అయ్యే అవకాశం లేదుగానీ.. విజయ్ తిరుచ్చి స్థానానికి రాజీనామా చేస్తే మాత్రం.. ఆ స్థానాన్ని త్రిషకు ఇస్తారని.. ఆమెను గెలిపించుకుని ప్రభుత్వంలో కీలక పోస్ట్ ఇస్తారనే ప్రచారమైతే జోరుగా సాగుతోంది. మొత్తంగా.. త్రిష నిజంగానే ఎన్నికల బరిలోకి దిగుతుందా? టీవీకే ప్రభుత్వంలో కీలక పాత్ర షోషిస్తుందా? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి:
విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే షణ్ముగం వర్గం..?
కాంగ్రెస్ మద్దతు విజయ్‌కేనా?.. కె.సి.వేణుగోపాల్ ఏం చెప్పారంటే..