Share News

విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే షణ్ముగం వర్గం..?

ABN , Publish Date - May 06 , 2026 | 11:12 AM

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, విజయ్‌కి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే షణ్ముగం వర్గం..?
Tamil Nadu politics 2026

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, విజయ్‌కి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకేలోని సీవీ షణ్ముగం వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఈ మేరకు పళనిస్వామికి ఇప్పటికే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై షణ్ముగం నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలతో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పళనిస్వామి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆ 30 మందితో కలిసి టీవీకేకి షణ్ముగం మద్దతు ఇచ్చేలా కనిపిస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం పార్టీదే అని షణ్ముగం చెబుతున్నప్పటికీ.. పళనిస్వామి నాయకత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మెుత్తం 47 స్థానాలు గెలుచుకుంది.


మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది. లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. కాగా, గురువారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. టీవీకేతో కలిసి వచ్చే పార్టీలతో సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ మద్దతు విజయ్‌కేనా?.. కె.సి.వేణుగోపాల్ ఏం చెప్పారంటే..

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Updated Date - May 06 , 2026 | 11:51 AM