కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: సీతక్క
ABN , Publish Date - May 06 , 2026 | 02:50 PM
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే06: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని సీతక్క పేర్కొన్నారు.
'రైతులను బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి రుణమాఫీ జరగలేదు. నాలుగు విడతలతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. కానీ, ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చింది. కేసీఆర్ పంట బోనస్ హామీ నెరవేర్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం పంటలకు బోనస్ ఇస్తోంది. రైతు బంధు నిధుల్లో బీఆర్ఎస్ తీవ్ర జాప్యం చేసింది. మా ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసింది' అని మంత్రి సీతక్క తెలిపారు.
'ఫామ్ హౌస్ పాలనలో రైతులు నష్టపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం కట్టుబడి పనిచేస్తోంది. ప్రజల్లో తిరుగుతున్నాం.. ఫారిన్ టూర్లలో కాదు. సమ్మక్క-సారలమ్మ ఆలయంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేశారు. కమిషన్ల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలి. లేకుంటే అదే ప్రజలు బుద్ధి చెప్తారు' అని సీతక్క వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు