నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు
ABN , Publish Date - May 06 , 2026 | 01:19 PM
కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
నెల్లూరు, మే 6: కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలిరానున్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
వారికి ఉపయోగపడేలా తీర్మానాలు: మంత్రి ఆనం
మూడు రోజుల పాటు రాష్ట్ర నేతలందరూ జిల్లాలోనే ఉంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. భవిష్యత్తుతరాలకు ఉపయోగపడేలా తీర్మానాలు ఉంటాయన్నారు. మొదటి రెండు రోజులు 20 వేల మంది డెలిగేట్స్ వస్తారని.. మూడో రోజు బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
నెల్లూరులో తొలిసారి మహానాడు: మంత్రి నారాయణ
నెల్లూరులో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో 2200 ఎకరాల స్థలం ఉందని.. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని అన్నారు. పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అందర్నీ సమన్వయం చేస్తూ, సమష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
కాకాణికి ఎమ్మెల్సీ రవిచంద్ర సవాల్
‘మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తామే గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఒక్క స్థానంలోనూ వైసీపీని గెలిపించలేక పోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారైనా కనీసం ఒక స్థానాన్ని గెలిపించే దమ్ము నీకుందా?.. దమ్ముంటే గెలిపించి చూపించు’ అంటూ కాకాణికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు
శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
Read Latest AP News And Telugu News