ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు
ABN , Publish Date - May 06 , 2026 | 11:08 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.
కాకినాడ, మే 6: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు(బుధవారం) ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు. మరికాసేపట్లో న్యాయస్థానం ఎదుట అనంత బాబును ప్రవేశపెట్టనున్నారు. అయితే పోలీస్ కస్టడీలో వైసీపీ ఎమ్మెల్సీ విచారణకు ఏమాత్రం సహకరించనట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో పోలీసులు 50 వరకు ప్రశ్నలు అడుగగా.. దేనికి కూడా అనంత బాబు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. సాక్షులను బెదిరించిన రౌడీ షీటర్లతో తనకే సంబంధం లేదంటూ అనంత బాబు బుకాయించినట్లు సమాచారం.
నేడు రాజమండ్రి జిల్లా కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో మూడు పిటిషన్లపై విచారణ జరగనుంది. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంత బాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. అలాగే సాక్షులను ప్రభావితం చేసిన కేసులో కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత బాబు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారించనుంది. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.
ఇవి కూడా చదవండి...
అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్
Read Latest AP News And Telugu News