Share News

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్

ABN , Publish Date - May 06 , 2026 | 01:51 PM

శ్రీసత్యసాయి జిల్లాలో హైవేపై దోపిడీకి పాల్పడిన ముఠాలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్
AP Highway Robbery

శ్రీ సత్యసాయి జిల్లా, మే 6: జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే దోపిడీ కేసులను పోలీసులు ఛేదించారు. పెనుకొండ సమీపంలో NH-44 పై జరిగిన రెండు భారీ దోపిడీ కేసుల్లో పురోగతి సాధించారు. మొత్తం రూ.5.8 కోట్ల విలువైన బంగారం, నగదు దోపిడీ జరిగినట్లు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టెక్నాలజీ, VOIP కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. మొత్తం 21 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు.


వీరిలో డ్రైవర్లు, టెక్ ఉద్యోగులు, లాజిస్టిక్స్ సిబ్బంది ఉన్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి రూ.1.26 కోట్ల నగదుతో పాటు ఇన్నోవా, బీఎండబ్ల్యూ కార్లు, 13 సెల్ ఫోన్లు,3 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీల సమయంలో బాధితులను బెదిరించి బంగారం, నగదు అపహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి కీలక ఆధారాలను సేకరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.


ఎట్టపరిస్థితుల్లో వదలం: ఎస్పీ సతీష్

నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీలోకి తీసుకుంటామని ఎస్పీ సతీష్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 02:06 PM