Share News

పాక్‌లోని బలూచిస్తాన్‌లో భూప్రకంపనలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:09 PM

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం భూకంపం సంభవించింది. ఆ ప్రావిన్స్‌లో ఉన్న ఖుజ్దార్ నగరానికి సమీపంలో కంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ భూకంప అధ్యయన కేంద్రం (ఈఎంఎస్‌సీ) తెలిపింది.

పాక్‌లోని బలూచిస్తాన్‌లో భూప్రకంపనలు

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం భూకంపం సంభవించింది. ఆ ప్రావిన్స్‌లో ఉన్న ఖుజ్దార్ నగరానికి సమీపంలో కంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందని యూరోపియన్‌ మెడిటరేనియన్‌ భూకంప అధ్యయన కేంద్రం (ఈఎంఎస్‌సీ) తెలిపింది. భూకంప కేంద్రం ఖుజ్దార్ నగరానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ రక్షణ కోసం ఇళ్లు, బిల్డింగులు, దుకాణాల నుంచి బయటకు పరుగెత్తి ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లారు. భూకంపం కారణంగా ఏమైనా భవనాలు దెబ్బతిన్నాయా లేదా ఎవరైనా చనిపోయారా అనే విషయాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. గ్రామాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.


భూకంపం తర్వాత మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఖుజ్జార్ సిటీ ప్రజలతో పాటు ఆ నగరానికి సమీపంలో నివసిస్తున్న వారికి కూడా అధికారులు సూచించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు బలూచ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, పోలీసులను తరలించారు. కాగా.. భారత్‌, యురేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే భౌగోళిక ప్రాంతానికి సమీపంలో పాకిస్థాన్ ఉంది. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని, ముఖ్యంగా బలూచిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 09:23 PM