ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఐరోపా వాళ్లు పాఠాలు చెప్పనక్కర్లేదు
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:18 AM
ప్రజాస్వామ్యంపై భారతదేశానికి ఐరోపా వాళ్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇటలీలోని అధికార కూటమిలో ఉన్న ఫోర్జా ఇటాలియా పార్టీ నేషనల్ డిప్యూటీ సెక్రటరీ, ఎంపీ బెర్గామిని అన్నారు.
ఫిలిబెక్‌పై ఇటలీ ఎంపీ బెర్గామిని మండిపాటు
లండన్, నవంబరు 16: ప్రజాస్వామ్యంపై భారతదేశానికి ఐరోపా వాళ్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇటలీలోని అధికార కూటమిలో ఉన్న ఫోర్జా ఇటాలియా పార్టీ నేషనల్ డిప్యూటీ సెక్రటరీ, ఎంపీ బెర్గామిని అన్నారు. భారత్ సమ్మిట్‌లో ఇటలీ రాజకీయ నాయకుడు ఫిలిబెక్.. వోట్ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని బెర్గామిని వ్యతిరేకించారు.
భారతదేశం మిత్రదేశమని పేర్కొన్నారు. మిత్ర దేశాల అంతర్గత రాజకీయ వివాదాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే, ఫిలిబెక్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఇటలీలో జార్జియా మెలోనీ ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. మోదీ, మెలోనీ మధ్య సత్సంబంధాలతో ఇటలీ, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో గతంలో పోలిస్తే ఎంతో బలోపేతం అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News