Share News

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:50 PM

హోర్ముజ్ జలసంధి విషయంలో తమ దేశ విధానాలు మారబోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు.

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి విషయంలో తమ దేశ విధానాలు మారబోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ (Abbas Araghchi) స్పష్టం చేశారు. ఇరాన్‌పై తాము మళ్లీ దాడులతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చిన కొన్ని గంటలకే అబ్బాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ తమపై మరో దాడి చేసినా.. హోర్ముజ్ అంశంలో తాము వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. ఆ జలసంధి యుద్ధం రాకముందు నాటి స్థితిలోకి తిరిగి వెళ్లదని తెలిపారు. యుద్ధం జరిగినా, జరగకున్నా తమ విధానాల్లో మాత్రం మార్పు ఉండదని పునరుద్ఘాటించారు.


అమెరికాకు కొంచెం హేతుబద్ధత ఉన్నా కూడా తమపై ఎలాంటి దాడులూ చేయదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అన్నారు. అలాగే పశ్చిమాసియా యుద్ధాన్ని ఆయన రమదాన్ (రంజాన్) వార్‌గా పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ రమదాన్ యుద్ధం ముగిసిపోవాలని కోరుకున్నారు.


ఈ వార్తలూ చదవండి

సైబర్ దాడులతోనూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చు: ప్రధాని హెచ్చరిక

6 నెలల్లో 23 మందికి మరణశిక్షలు.. జడ్జి రవికుమార్ దివాకర్ బదిలీ

Updated Date - Oct 25 , 2026 | 09:50 PM