Share News

ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

ABN , Publish Date - Sep 06 , 2026 | 04:52 PM

ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంధన ట్యాంకర్‌ ఇతర వాహనాలను ఢీకొని పేలిపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Fuel tanker crashes

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంధన ట్యాంకర్‌ ఇతర వాహనాలను ఢీకొని పేలిపోవడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుర్దెస్థాన్ ప్రావిన్సులోని సనందజ్‌-హమెదాన్‌ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.


ఫ్యూయెల్ ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొన్న తర్వాత అందులోంచి మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పేలుడు ధాటికి సమీపంలోని పలు కార్లక మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనతో 2018లో జరిగిన ప్రమాదం మరోసారి తెరపైకివచ్చింది. నాడు ఇదే తరహాలో ఓ ఇంధన ట్యాంకర్‌ ప్రయాణికుల బస్సును ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇవీ చదవండి:

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!

మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!

Updated Date - Sep 06 , 2026 | 04:58 PM