నేను పోటీ చేసుంటే, మాకు భారీ మెజారిటీ వచ్చేది: ట్రంప్
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:27 PM
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమికి తమ పార్టీనే కారణమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమికి తమ పార్టీనే కారణమని ఆయన పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తాను పోటీచేసుంటే, తమ పార్టీ భారీ విజయం సాధించి ఉండేదని అన్నారు. తాజాగా వెలువడిన ఫలితాలను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు.
డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తా
టెక్సస్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఓహియోలోని సెనేట్లలో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ సీట్లలో ట్రంప్ స్వయంగా ప్రచారం చేసినా తన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోయారు. తాను పోటీ చేయకున్నా బ్యాలెట్ పేపర్‌పై తాను ఉన్నట్లు ఊహించుకొని, తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను ట్రంప్ అభ్యర్థించారు. కాగా.. మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత న్యూయార్క్ టైమ్స్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ఓటమిని పూర్తిగా అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని, అందుకు తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. తనకు ఉన్న వీటో అధికారాలతో వచ్చే రెండేళ్లలో ప్రభుత్వాన్ని నడుపుతానని పేర్కొన్నారు.
సెనేట్‌పై డెమోక్రాట్ల పట్టు
2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా నడిచింది. సెనేట్‌లో 35 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. అలాగే.. ప్రతినిధుల సభలోనూ ఏడు సీట్లలో రిపబ్లికన్లను ఓడించారు. ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను తాజా ఎన్నికల్లో ఓటర్లు వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదల, ఇరాన్‌తో యుద్ధం, అవినీతి వంటి సమస్యలతో ఓటర్లు విసిగిపోయారు. కాగా 1998 నుంచి సౌత్ కరోలినా సెనేట్ సీటులో డెమోక్రాట్లు గెలవలేదు. అన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆ సీటును దక్కించుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం